Citi-Axis Migration: యాక్సిస్‌లో విలీనమైన సిటీ బ్యాంక్.. క్రెడిట్ కార్డుదారులు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

|

Jul 17, 2024 | 1:58 PM

మైగ్రేషన్ పూర్తయినప్పుడు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉన్న కస్టమర్‌లు కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డులను పొందుకోవాల్సి ఉంటుంది. అయితే కొత్త కార్డులు రావడానికి సమయం పడుతుంది కాబట్టి కొన్ని నెలల పాటు పాత సిటీ బ్యాంక్ కార్డులనే వినియోగించుకోవచ్చు. తర్వాత యాక్సిస్ బ్యాంక్ తొమ్మిది సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను దశలవారీగా తొలగిస్తుంది.

Citi-Axis Migration: యాక్సిస్‌లో విలీనమైన సిటీ బ్యాంక్.. క్రెడిట్ కార్డుదారులు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Citi bank to merge Axis bank
Follow us on

సిటీ బ్యాంక్ ప్రస్థానం ఇక గతం కానుంది. ఎందుకంటే సిటీ బ్యాంక్ ప్రముఖ ప్రైవేటు బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్ లో విలీనం కానుంది. దీంతో సిటీ బ్యాంక్ వినియోగదారుల్లో కొన్ని సందేహాలు, ఆందోళనలు ఉన్నాయి. మార్పులు ఏముంటాయి? తమ క్రెడిట్ కార్డులు పని చేస్తాయా? కొత్త నిబంధనలు ఏంటి అన్న ప్రశ్నలు చాలా మంది ఉంటాయి. ఈ క్రమంలో యాక్సిస్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్లో వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని పొందుపరిచింది. వారు తరచూ అడుగుతున్న కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు కూడా అందుబాటులో ఉంచింది. ఈ నేపథ్యంలో సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులు తెలుసుకోవాల్సిన అంశాలను మీకు అందిస్తున్నాం..

కొత్త క్రెడిట్ కార్డులు వస్తాయి..

మైగ్రేషన్ పూర్తయినప్పుడు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉన్న కస్టమర్‌లు కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డులను పొందుకోవాల్సి ఉంటుంది. అయితే కొత్త కార్డులు రావడానికి సమయం పడుతుంది కాబట్టి కొన్ని నెలల పాటు పాత సిటీ బ్యాంక్ కార్డులనే వినియోగించుకోవచ్చు. యాజమాన్య బదిలీ పూర్తయిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ తొమ్మిది సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను దశలవారీగా తొలగిస్తుంది. వాటి స్థానంలో ఏడు కొత్త కార్డ్ రకాలను యాక్సిస్ బ్యాంక్ అభివృద్ధి చేస్తోంది. ఒకవేళ మీరు ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అయి ఉంటే మీకు ప్రత్యేకమైన బ్యాంక్ కస్టమర్ నంబర్ అందిస్తారు. దానిని సిటీ బ్యాంక్ కనెక్షన్‌కి లింక్ ఈజీగా లింక్ చేస్తారు. ఒకవేళ మీకు యాక్సిస్ బ్యాంక్ ఖాతా లేకపోతే అప్పుడు కొత్త యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ ఐడీ ఇస్తారు. ఇది ఎస్ఎంఎస్ రూపంలో మీకు అందుతుంది.

లావాదేవీలు, కార్డ్ సమాచారం..

  • ఖాతాదారుల క్రెడిట్ కార్డ్ వినియోగ విధానాలకు సంబంధించిన కొత్త రూల్స్, అప్ డేట్లు మీకు యాక్సిస్ బ్యాంక్ ద్వారా తెలియజేస్తారు. మీ కార్డు నంబర్, పిన్, గడువు తేదీ సీవీవీ వంటివి మారవు.
  • కార్డ్ వినియోగంపై పరిమితులు (కాంటాక్ట్‌లెస్, ఇ-కామర్స్, పాయింట్ ఆఫ్ సేల్, ఏటీఎం విదేశీ లావాదేవీలు వంటివి) కూడా మారవు.
  • బాకీ ఉన్న మొత్తాలు, కొనసాగుతున్న ఈఎంఐలు రెండూ ప్రభావితం కావు.
  • బిల్లింగ్ సైకిల్ మారదు, అలాగే స్టేట్‌మెంట్ క్రియేషన్, చెల్లింపు గడువు తేదీలు మారవు.
  • ఖర్చు ఆధారిత రుసుము మినహాయింపులు, వార్షిక రుసుములు రెండూ మారవు.
  • అయితే, యాక్సిస్ బ్యాంక్ ఛానెల్‌లు సిటీ బ్యాంక్ ఛానెల్‌లను చెల్లింపు ఛానెల్‌లుగా భర్తీ చేస్తాయి. వినియోగదారులు ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా తమ డిజిటల్ సేవలను యాక్సెస్ చేస్తారు.

హెచ్చరికలు, కస్టమర్ సేవ..

  • యాక్సిస్ బ్యాంక్ ఫోన్ బ్యాంకింగ్ సిటీ ఫోన్‌ను ప్రైమరీ కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్‌గా భర్తీ చేస్తుంది.
  • ఇ-కామర్స్ చెల్లింపు ప్రమాణీకరణ, లావాదేవీ నోటిఫికేషన్‌ల కోసం పోర్టల్‌లు ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ లోగోను కలిగి ఉంటాయి.

రివార్డు పాయింట్లు..

యాజమాన్య బదిలీ నాటికి ఇంకా ఉపయోగించని అన్ని రివార్డ్ పాయింట్‌లు విలువలో ఎటువంటి మార్పు లేకుండా, ఎడ్జ్ మైల్స్ లేదా యాక్సిస్ ఎడ్జ్ రివార్డ్ పాయింట్‌లకు మారుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..