
World Fastest Train: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు CR450 ట్రయల్ రన్ నిర్వహించడం ద్వారా చైనా మరోసారి హై-స్పీడ్ రైలు సాంకేతికతలో కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటికే జరిగిన ట్రయల్స్‌లో ఈ రైలు గంటకు 453 కిలోమీటర్ల (281 మైళ్లు) వేగాన్ని అందుకుని కొత్త రికార్డు నెలకొల్పింది. CR450 చైనాలోని రెండు ప్రధాన నగరాలైన షాంఘై-చెంగ్డులను కలిపే హై-స్పీడ్ రైలు మార్గంలో నడుస్తుంది. ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇది కనీసం 600,000 కిలోమీటర్లు విజయవంతంగా నడిచిన తర్వాత మాత్రమే వాణిజ్య కార్యకలాపాలకు ఆమోదిస్తారు. చైనా రాష్ట్ర మీడియా CGTN ప్రకారం, రైలులోని అన్ని ఇంజనీరింగ్, భద్రతా తనిఖీలు చివరి దశలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Viral Video: రెండు కోచ్‌ల మధ్య ప్రయాణం.. ఇలాంటి డేంజర్ వీడియో మీరెప్పుడైనా చూశారా? దీనికి మీరేమంటారు?
CR450 వాణిజ్యపరంగా గంటకు 400 కి.మీ వేగంతో పనిచేసేలా రూపొందించారు. ఇది ప్రస్తుత CR400 “ఫక్సింగ్” రైళ్ల కంటే పూర్తి 50 కి.మీ/గం వేగంతో పనిచేస్తుంది. CR450 అత్యంత ముఖ్యమైన లక్షణం దాని వేగం. ప్రస్తుత ఫక్సింగ్ EMU రైళ్లకు అవసరమైన 6 నిమిషాల 20 సెకన్లతో పోలిస్తే, ఈ రైలు కేవలం 4 నిమిషాల 40 సెకన్లలో గంటకు 350 కి.మీ.ను చేరుకోగలదు.
డిజైన్ ప్రత్యేకమైనది:
ఈ రైలు రూపకల్పనలో ఏరోడైనమిక్స్‌కు ప్రత్యేకత. దీని ముక్కు గద్ద ముక్కు లాగా, బాణం ఆకారంలో ఉంటుంది. దీనిని అభివృద్ధి చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. ఇతర హై-స్పీడ్ రైళ్లతో పోలిస్తే CR450 ఎయిర్ డ్రాగ్ 22% తగ్గింది. దీని రూఫ్‌లైన్ 20 సెంటీమీటర్లు తగ్చింది.దాని బాడీ పొడవుగా, సన్నగా ఉంటుంది. ఇది బరువులో కూడా తేలికగా ఉంటుంది. ఈ లక్షణాలు రైలును వేగవంతం చేయడమే కాకుండా విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గిస్తాయి.
#China’s #CR450 — the world’s fastest train! 🚄💨
Top speed: 450 km/h | Operating speed: 400 km/h 🇨🇳⚡#HighSpeedRail #ChinaTech #ChinaInnovation #ModernChina #ChinaVibes pic.twitter.com/YzzVUXDMPO— Chinese Embassy in US (@ChineseEmbinUS) October 22, 2025
ఇది కూడా చదవండి: New Rules: నవంబర్ 1 నుండి జరిగే కీలక మార్పులు.. మీ జేబుపై ప్రభావం చూపే అంశాలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి