Chicken Price Down: ఢమాల్.. ఢమాల్.. మరింత పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ రేటు ఎంతో తెలుసా..?

|

Feb 04, 2021 | 9:02 AM

కరోనా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు ఫౌల్ట్రీ వ్యాపారులు. ఇప్పుడు మాయదారి బర్డ్ ఫ్లూ వారి పొట్ట కొడుతోంది. చికెన్ ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి.

Chicken Price Down: ఢమాల్.. ఢమాల్.. మరింత పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ రేటు ఎంతో తెలుసా..?
Follow us on

Chicken Price Down:  కరోనా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు ఫౌల్ట్రీ వ్యాపారులు. ఇప్పుడు మాయదారి బర్డ్ ఫ్లూ వారి పొట్ట కొడుతోంది. చికెన్ ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. చికెన్ అమ్మకాల విషయంలో ఘాజిపూర్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా ప్రఖ్యాతి గాంచిన విషయం తెలిసిందే. అక్కడ చికిన్ ధరలు పతనమవుతున్నట్లు స్పష్టంగా మార్కెట్ రేట్లను బట్టి అర్థమవుతుంది.  దీంతో ఫౌల్ట్రీ ఫామ్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఘాజిపూర్ మార్కెట్‌లో కోడి ధర మరీ దారుణంగా కేజీకి రూ.35కు పడిపోయింది. మార్కెట్‌లోకి వ్యాపారులు మాట్లాడుతూ.. బర్డ్ ఫ్లూ పోయినట్లు కనిపిస్తున్నా కూడా పరిస్థితుల్లో ఎటువంటి మార్పులేదని చెప్పారు. చాలామంది అపోహలతో చికెన్, ఎగ్స్‌కు తినేందుకు ఇంట్రస్ట్ చూపించడం లేదన్నారు.  చికెన్ ధరలు తక్కువగా ఉండటం వల్ల రిటైల్ వ్యాపారులు మరీ తక్కువ ధరలకు బేరం అడుగుతునన్నారని చెప్పారు. కోడి ధర కేజీకి రూ.35 నుంచి రూ.56 వరకు పలుకుతోందని చెప్పారు. మేలు రకం కోడి ధర కేజీకి రూ.56 వరకు ఉందని వెల్లడించారు. కోడి కాకుండా చికెన్ ధర కిలో రూ.90 వరకు మాత్రమే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు

ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో కేజీ చికెన్ ధర రూ.120 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. అదే లైవ్ కోడి విషయానికి వస్తే.. కేజీకి రూ.80 వరకు అమ్ముతున్నారు.

IRCTC offer: ఐఆర్‌సీటీసీ బంఫర్ ఆఫర్.. అదిరే క్యాష్‌బ్యాక్.. కొన్ని రోజులు మాత్రమే.. పూర్తి వివరాలు ఇవి

ఒక మహిళ రూ. 10 వేలతో వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడు కోట్లలో టర్నోవర్ ఉంది. ఆమె మరెవరోకాదు, నీతా అడప్పా. ఒక బ్రాండ్