
మొన్నటివరకు పండుగల సీజన్, మేడారం జాతర ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కగా.. ఇప్పుడు పండుగ సీజన్ ముగియడంతో ధరలు ఇప్పుడిప్పుడే దిగొస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో క్రిస్మస్ ఉండటం, ఆ తర్వాత కొత్త ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ రావడం, మేడారం జాతర జరగడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కేజీ చికెన్ రూ.350 వరకు తెలుగు రాష్ట్రాల్లో చేరుకుంది. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ధరలు తగ్గుతుండటంతో నాన్ వెజ్ ప్రియులు ఉపశమనం పొందుతున్నారు. జనవరి 8న సండే కావడంతో చికెన్‌కు డిమాండ్ ఉంటుంది. సెలవు కాకడంతో చికెన్ తినేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. ధరలు తగ్గడం వీరికి కాస్త రిలీఫ్ ఇచ్చింది.
ప్రస్తుతం కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 240 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. ఇక డ్రెస్‌డ్ చికెన్ కిలో రూ.220 నుంచి రూ.230 వరకు ఉండగా.. లైవ్ చికెన్ రూ.118 నుంచి రూ.120కే లభిస్తుంది. మేడారం జాతర సమయంలో డిమాండ్ కారణంగా స్కిన్‌లెస్ చికెన్ రూ.350నుంచి రూ.380 వరకు కూడా వ్యాపారులు విక్రయించారు. ఇక డ్రెస్‌డ్ చికెన్‌ను రూ.350కు, లైవ్ కోడిని రూ.200 వరకు విక్రయించారు. జాతర ముగిసిన తర్వాత చికెన్ ధరలు ఢమాల్ అంటూ పడిపోయాయి. వారం రోజుల వ్యవధిలోనే రూ.100 తగ్గడంతో నాన్‌వెజ్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పండుగ సీజన్ ముగియడంతో కోళ్లకు డిమాండ్ పడిపోయిందని, ధరలు తగ్గడానికి ఇదే కారణమని వ్యాపారుల చెబుతున్నారు. అలాగే కోళ్ల ఉత్పత్తి కూడా పెరగడం వల్ల ధరలు పడిపోతున్నాయని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల ఫామ్స్‌లో ఉత్పత్తి బాగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ లేకపోవడంతో తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. ఇక చికెన్ ధరలతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. గత నెలలో ఏకంగా ఒక్కో కోడిగుడ్డు ధర రూ.10కు చేరుకుంది. రిటైల్ షాపుల్లో రూ.10కి విక్రయించారు. ఇప్పుడు కేవలం ఒక్కో గుడ్డు రూ.6కే షాపుల్లో అమ్ముతున్నారు. కోడిగుడ్ల ధరలు కూడా ఒకేసారి కుప్పకూలాయి. దీంతో సామాన్యులకు ధరల భారం తగ్గిందని చెప్పవచ్చు. ఇవాళ అసలే సండే కారణంతో చికెన్ షాపుల ముందు జనం క్యూ కడుతున్నారు. చికెన్ కొనుగోలు చేసేందుకు ఎగబపడుతున్నారు. దీంతో మాంసం దుకాణాలన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. అటు మటన్ ధరలు కూడా పండుగ తర్వాత తగ్గాయి. పండుగ సమయంలో రూ.1500 వరకు పలకగా.. ఇప్పుడు రూ.800కే లభిస్తోంది.