BMW Cars Gift: ఐటీ కంపెనీలో(IT companies) ఉద్యోగమంటే.. పనికి తగ్గట్టుగానే జీతభత్యాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు టాలెంటెడ్(Talent) ఉద్యోగులకు కోట్లలో జీతాలను ఆఫర్ చేస్తుంటాయి. బోనస్ లు, శాలరీ హైక్ లు, రిక్రియేషన్ ఎమినిటీస్, పని సమయాల్లో వెసులుబాట్ల వంటివి అందిస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత ఇటీవల కాలంలో నెలకొన్న డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వల్ల పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. కరోనా సమయంలో సమయభావాన్ని పక్కన పెట్టి చాలా మంది టెక్ ఉద్యోగులు తన సంస్థల కోసం పని చేశారు. సంక్షోభం సమయంలో కంపెనీలకు అండగా ఉండి మంచి లాభాలు గడించేందుకు తమ వంతు తోడ్పాటును అందించారు. ఇలా సంస్థ ఎదుగులకు అండగా నిలిచిన ఉద్యోగులకు.. చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ కంపెనీ కిస్‌ఫ్లో ఇంక్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేమీ చిన్నా చితకా బహుమతి కాదు ఏకంగా ఉద్యోగులకు బీఎండబ్ల్యూ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఖరీదైన టిఫ్ట్ విలువ ఒక్కొక్కటి కోటి రూపాయలుగా ఉంది.
ఉద్యోగుల విధేయతకు, అంకిత భావానికి మెచ్చిన కంపెనీ.. తన సీనియర్ మేనేజ్‌మెంట్ టీమ్‌లోని ఐదుగురు ఉద్యోగులకు ఈ కార్లను బహుకరించింది. ఈ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చే విషయాన్ని ఈవెంట్ ప్రారంభమయ్యే దాకా రహస్యంగా ఉంచటంతో ఉద్యోగులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. 5 లక్కీ ఉద్యోగులు అత్యంత ఖరీదైన కార్లకు ఓనర్లుగా మారబోతున్నారంటూ ప్రకటించింది. కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఐదుగురు ఉద్యోగులు తమ సంస్థను వీడలేదని కిస్‌ఫ్లో ఇంక్ సీఈవో సురేశ్ వెల్లడించారు. కరోనా మహమ్మారి సమయంలో ఈ ఉద్యోగులు కంపెనీకి అద్భుతమైన సేవలందించారని పేర్కొన్నారు. వీరిలో కొందరు ఉద్యోగులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తమ కంపెనీలో చేరారని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో అత్యంత కష్టమైన వ్యాపార వాతావరణంలో బిజినెస్‌లను పట్టాలెక్కించేందుకు కంపెనీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని సీఈవో తెలిపారు. ఈ సమయంలో కొందరు ఇన్వెస్టర్ల నుంచి తాము ఎన్నో ప్రశ్నలను, సందేహాలను ఎదుర్కొన్నట్లు వివరించారు. కిస్‌ఫ్లో ప్రారంభించినప్పుడు కొందరు ఉద్యోగులు మధ్యలోనే సంస్థను విడిచిపెట్టి వెళ్లిపోయిన విషయాన్ని సురేశ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కంపెనీని గట్టెక్కించేందుకు తనతో పాటు పనిచేసిన ఈ ఉద్యోగులకు సంస్థ తరఫున బీఎండబ్ల్యూ కార్లను బహుకరిస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి..
Car Purchase: మీ పాత కారు మార్చాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..
Pakistan Crisis: ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం పతనం వెనుక అమెరికా హస్తం ఉందా?