వాణిజ్య పంటల ద్వారా భారీ ఆర్జించవచ్చని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందొచ్చు. అలాంటి వాటిలో ఏలకుల సాగు ఒకటి. ప్రతీ వంటింట్లో కచ్చితంగా ఉండే వస్తువుల్లో ఏలకులు మొదటి స్థానంలో ఉంటాయి. వీటిలోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని మేలు చేస్తే, దీని వాసన ఆహారానికి మంచి సువాసనను తీసుకొస్తుంది.
అనునిత్యం డిమాండ్ ఉంటే వీటిని సాగు చేస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ ఏలకులను ఎలా సాగు చేయాలి.? వీటి ద్వారా ఎలాంటి లాభాలు పొందొచ్చు.? ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఏలకుల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆకుపచ్చ రెండోది గోధుల ఏలకులు. మనం ఎక్కువగా గోధుమ ఎలకులను ఉపయోగిస్తుంటాం. ఇక ఏలకుల మొక్క 1 నుంచి 2 అడుగుల పొడవు పెరుగుతుంది. ఈ మొక్క యొక్క కాండం 1 నుంచి 2 మీటర్ల పొడవు ఉంటుంది. ఏలకుల మొక్క క ఆకులు 30 నుంచి 60 సెం.మీ పొడవు, వెడల్పు 5 నుంచి 9 సెం.మీ వరకు ఉంటుంది.
ఏలకు సాగుకు ఎర్రమట్టి నేల మంచిదని చెబుతుంటారు. ఇందకు భూమి పీహెచ్ విలువ 5 నుంచి 7.5 వరకు ఉండాలి. అలాగే సాగుకు 10° నుంచి 35°C ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. ఏలకుల మొక్కలను 2 నుంచి 3 అడుగుల దూరంలో నాటాలి. ఇక ఏలకులు చేతికి వచ్చాక చాలా రోజుల పాటు ఎండలో ఆరబెట్టాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇందుకు ప్రత్యేక యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటి సహాయంతో వేడి ఉష్ణోగ్రత వద్ద 18 నుంచి 24 గంటలు ఎండబెడితే సరిపోతుంది. వీటిని నాటడానికి జులై నెల సరైన సమయంగా చెప్పొచ్చు. ఏలకుల మొక్కలకు ఎండ ఎక్కువగా తగలకుండా చూసుకోవాలి.
ఇక లాభాల విషయానికొస్తే సాగు సరిగ్గా వస్తే లక్షలు ఆర్జించవచ్చు. ముఖ్యంగా ఏలకుల ధర వాటి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. మంచి పరిమాణంలో ఉంటే ఎక్కువ ధర పలుకుతుంది. సాధారణంగా మార్కెట్లో కిలో ఏలకుల ధర రూ. 1100 నుంచి రూ. 2000 వరకు ఉంటుంది. సుమారు రెండు ఎకరాల్లో ఏలకుల మొక్కలను నాటితే ఏకంగా 135 నుంచి 150 కిలోల వరకు ఏలకుల సాగు లభిస్తుంది. దీంతో కనీసం రూ. 3 లక్షల ఆధాయం పొందొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..