
ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు పసిడి అభిమాన పెట్టుబడి సాధనంగా మారింది. ఈ నేపథ్యంలో గతంలో బంగారం కొనుగోలు చేసిన వారికి పసిడి సిరులు కురిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న ధర నేపథ్యంలో దీర్ఘకాలిక కొనుగోళ్లు తగ్గినప్పటికీ భారతీయ మహిళలు ఇప్పటికీ బంగారం కొనుగోలు ఆసక్తి చూపుతున్నారు. పలు నివేదికల ప్రకారం 2015లో 24 క్యారెట్ల బంగారం సగటు వార్షిక ధర 10 గ్రాములకు రూ. 26,343.50గా ఉంది. పది సంవత్సరాల తర్వాత 2025లో బంగారం ధర ఇప్పుడు 10 గ్రాములకు రూ. లక్ష దాటింది. అక్షయ తృతీయ, వివాహాల సీజన్ సందర్భంగా డిమాండ్ పెరుగుతుందని ఊహించి స్థానిక ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టులు బంగారంపై పెట్టుబడిని పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం బంగారంలో రూ. 4 లక్షల పెట్టుబడి పెడితే ఇప్పుడు దాదాపు రూ. 15 లక్షలు చేరింది. ముఖ్యంగా 2025లో నాలుగు నెలల్లో బంగారం 25 శాతం కంటే ఎక్కువ పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే 42% పెరిగింది. ఈ ఒక్క ఏప్రిల్‌లోనే 10 శాతం రాబడి వచ్చింది.
2015లో అదే మొత్తం అంటే రూ. 4 లక్షలతో కారు కొనుగోలు చేస్తే క్రమంగా ఆ కారును మనం వాడుతూ ఉంటాం. ప్రస్తుతం పునఃవిక్రయ విలువ రూ. 1 లక్ష లేదా అంతకంటే తక్కువకు తగ్గిపోతుంది. సెకండ్ జెనరేషన్ మారుతీ ఆల్టో కే 10 వంటి వాహనం 2015 ప్రారంభంలో రూ. 3.06 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అమ్ముడైంది. బంగారు ఆభరణాలతో కారును పోల్చడం కొంతవరకు అన్యాయమే అయినప్పటికీ కార్ల పునఃవిక్రయ వెబ్‌సైట్‌లలో ఈ కారు గరిష్టంగా రూ. 2 లక్షలకు అమ్ముడయ్యే అవకాశం ఉందనిన నిపుణులు చెబుతున్నారు.
గతంలో ఈ పోలికతో ఎన్నో మీమ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మీ భార్య బంగారం షాపింగ్ చేయకుండా ఎప్పుడూ ఆపకండి. తాను రూ.8 లక్షలకు కొనుగోలు చేసిన కారు విలువ గత 10 సంవత్సరాలలో రూ.1.5 లక్షలకు తగ్గిందని, అదే అతని భార్య గత దశాబ్దంలో కొన్న బంగారు ఆభరణాల విలువ రెట్టింపు కంటే ఎక్కువ రాబడినిచ్చిందని చాలా మంది సోషల్ మీడియాలో జోక్స్ పేలుస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి