Car Loan: కారు లోన్ తీసుకునే ముందు ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేకపోతే నష్టపోవడం పక్కా..

కారు లోన్ తీసుకునే కొన్న కీలక విషయాలు తప్పక తెలుసుకోవాలి.. మీ క్రెడిట్ స్కోరును మెరుగుపరచుకోవడం, తక్కువ కాల వ్యవధిని ఎంచుకోవడం, ఎక్కువ డౌన్ పేమెంట్ చేయడం ముఖ్యం. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి, మీ బడ్జెట్‌కు సరిపోయే కారును ఎంచుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులను నివారించవచ్చు. 5 ముఖ్యమైన సూచనలు ఏంటంటే..?

Car Loan: కారు లోన్ తీసుకునే ముందు ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేకపోతే నష్టపోవడం పక్కా..
Car Loan Tips

Updated on: Dec 12, 2025 | 12:18 PM

సొంత కారు కొనాలనేది సామాన్యుల కల. లక్షల రూపాయలు ఒకేసారి పెట్టడం కష్టం కాబట్టి చాలా మంది లోన్ తీసుకుని కారు కొంటారు. మీరు కూడా త్వరలో కారు లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే మీరు ఇబ్బందుల్లో పడకుండా ఉండాలంటే ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలపై ఫోకస్ పెట్టాలి. కారు లోన్ తీసుకునేటప్పుడు పాటించాల్సిన 5 ముఖ్యమైన సూచనలు ఇవే..

మంచి క్రెడిట్ స్కోరుతో లోన్..

కారు లోన్ తీసుకోవడానికి ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా తక్కువ లేదా సగటు స్కోర్‌పై కూడా బ్యాంకులు రుణాలు ఇస్తాయి. కానీ అప్పుడు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది మీ నెలవారీ EMI భారాన్ని పెంచుతుంది. మంచి క్రెడిట్ స్కోరు ఉంటే బ్యాంకులు మీకు తక్కువ వడ్డీ రేటుకు లోన్ ఇస్తాయి.

ఎక్కువ కాలం ఉండే లోన్ వద్దు

మీరు లోన్ తిరిగి చెల్లించే కాలపరిమితి ఎంత ఎక్కువైతే మీరు బ్యాంకుకు వడ్డీ రూపంలో అంత ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. కారు లోన్ తీసుకునేటప్పుడు మీ కాలపరిమితి 4 నుంచి 5 సంవత్సరాలు మించకుండా ఉండేలా చూసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

ఎక్కువ డౌన్ పేమెంట్ చేయండి

కారు లోన్ తీసుకునేటప్పుడు వీలైనంత ఎక్కువ డౌన్ పేమెంట్ చేయడానికి ప్రయత్నించండి. డౌన్ పేమెంట్ ఎంత ఎక్కువగా చేస్తే మీరు బ్యాంకు నుండి తీసుకునే అప్పు మొత్తం అంత తగ్గుతుంది. దీనివల్ల వడ్డీ భారం, EMIలు తక్కువగా ఉంటాయి. కారు ధరలో కనీసం 20 శాతం వరకు డౌన్ పేమెంట్ చేయడం ఉత్తమం.

వివిధ బ్యాంకుల పోలిక తప్పనిసరి

ఏదో ఒక బ్యాంకు లోన్ ఆఫర్ ఆధారంగా నిర్ణయం తీసుకోకండి. మీరు కనీసం 3 నుంచి 4 వేర్వేరు బ్యాంకుల వడ్డీ రేట్లు, ఆఫర్లను పోల్చి చూడాలి. లోన్ వడ్డీ రేటుతో పాటు బ్యాంకులు విధించే ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర దాచిన ఛార్జీల గురించి కూడా తెలుసుకోవాలి.

మీ బడ్జెట్ ప్రకారం కారును ఎంచుకోండి

కారు లోన్ దొరికినంత మాత్రాన మీరు ఖరీదైన కారు కొనడానికి అర్హులు అని కాదు. మీరు లోన్ తో ఖరీదైన కారు కొంటే చాలా కాలం పాటు అధిక ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుంది. మీకు లోన్ ఉన్నప్పటికీ మీ ఆర్థిక బడ్జెట్‌కు సరిపోయే సరసమైన కారును మాత్రమే ఎంచుకోండి. దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి