Byjus: బైజూస్‌ ఓనర్‌ జైజు రవీంద్రన్‌కు బిగ్‌ షాక్‌..! ఏకంగా రూ.107 కోట్ల జరిమానా విధించిన కోర్టు

బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌కు యూఎస్‌ కోర్టు డిఫాల్ట్ తీర్పు జారీ చేసింది. GLAS ట్రస్ట్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, రవీంద్రన్ 1 బిలియన్ డాలర్ల వ్యక్తిగత రుణ బాధ్యతను తీర్చాలని ఆదేశించింది. డాక్యుమెంట్లు బహిర్గతం చేయడంలో విఫలమవడం, నిబంధనలు ఉల్లంఘించడమే దీనికి కారణం.

Byjus: బైజూస్‌ ఓనర్‌ జైజు రవీంద్రన్‌కు బిగ్‌ షాక్‌..! ఏకంగా రూ.107 కోట్ల జరిమానా విధించిన కోర్టు
Byju Raveendran

Updated on: Nov 23, 2025 | 6:00 AM

బైజు ఆల్ఫా, అమెరికాకు చెందిన రుణదాత GLAS ట్రస్ట్ కంపెనీ LLC దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా బైజు రవీంద్రన్‌పై యూఎస్‌ కోర్టు డిఫాల్ట్ తీర్పును జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం.. రవీంద్రన్ వ్యక్తిగతంగా 1 బిలియన్‌ డాలర్లకు పైగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. విచారణ సందర్భంగా డెలావేర్ దివాలా కోర్టు రవీంద్రన్ తన డాక్యుమెంట్ బహిర్గతం ఆదేశాన్ని పాటించడంలో విఫలమయ్యాడని, అనేక సందర్భాల్లో తప్పించుకుంటున్నాడని కోర్టు నిర్ధారించింది.

నిందితుడు రవీంద్రన్‌పై డిఫాల్ట్ తీర్పును నమోదు చేసిందని, సెక్షన్ 2, సెక్షన్ 5, సెక్షన్ 6 ప్రయోజనాల కోసం అతనికి 533,000,000 డాలర్ల వ్యక్తిగత చెల్లింపు, మరో 540,647,109 డాలర్లు చెల్లించాలని తీర్పులో పేర్కొంది. బైజు ఆల్ఫా నిధులు, దాని నుండి వచ్చే ఏదైనా ఆదాయం, కామ్‌షాఫ్ట్ LP వడ్డీ వంటివి, ప్రతి లావాదేవీ, దాని నుండి వచ్చే ఏదైనా ఆదాయాన్ని వివరిస్తూ పూర్తి, కచ్చితమైన అకౌంటింగ్‌ను అందించాలని కోర్టు రవీంద్రన్‌ను ఆదేశించింది.

రవీంద్రన్ బైజూస్ బ్రాండ్ కింద పనిచేసే ఎడ్యూకేషన్‌ టెక్‌ కంపెనీ థింక్ అండ్‌ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్‌ను నిర్వహిస్తున్నప్పుడు, ఆ కంపెనీ యూఎస్‌ రుణదాతల నుండి బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. తరువాత రుణదాతలు బైజూస్ ఆల్ఫా రుణ నిబంధనలను ఉల్లంఘించిందని, రుణ మొత్తంలో 533 మిలియన్ డాలర్లను US నుండి చట్టవిరుద్ధంగా బదిలీ చేసిందని ఆరోపించారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి