Anand Mahindra: ఒరిజినల్ టెస్లా కార్ ఇదేనంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. ఎలాన్ మస్క్ ను ట్విట్టర్‌లో ట్యాగ్

|

Apr 25, 2022 | 2:53 PM

Anand Mahindra: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆసక్తిగల సోషల్ మీడియా వినియోగదారు. ఆయన చమత్కారమైన పోస్ట్‌లను పంచుకోవడంలో ప్రసిద్ధి చెందారు. 'బ్యాక్ టు ది ఫ్యూచర్' అనే టైటిల్ తో తాజాగా ఆయన చేసిన ట్వీట్‌లో(Twitter) మహీంద్రా బాస్ ఇలా రాశారు.

Anand Mahindra: ఒరిజినల్ టెస్లా కార్ ఇదేనంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. ఎలాన్ మస్క్ ను ట్విట్టర్‌లో ట్యాగ్
Anand Mahindra
Follow us on

Anand Mahindra: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆసక్తిగల సోషల్ మీడియా వినియోగదారు. ఆయన చమత్కారమైన పోస్ట్‌లను పంచుకోవడంలో ప్రసిద్ధి చెందారు. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ అనే టైటిల్ తో తాజాగా ఆయన చేసిన ట్వీట్‌లో(Twitter) మహీంద్రా బాస్ ఇలా రాశారు. “గూగుల్ మ్యాప్ అవసరం లేదు, ఇంధనం కొనాల్సిన పనిలేదు, కాలుష్యం ఉండదు, పూర్తిగా స్వీయంగా నడిచే(Self Driven) అవసరం ఉండదు.. విశ్రాంతి పొందండి, నిద్రపోండి, మీ గమ్యస్థానాన్ని చేరుకోండి.” అని అందులో రాశారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ను ట్యాగ్ చేయటం.

సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల రేసులో ముందున్న ఆటోమొబైల్‌ సంస్థ టెస్లా మోటార్స్. ఇది ప్రపంచంలో అందరికీ తెలుసు. అనతి కాలంలోనే టెస్లా ఎలక్ట్రిక్‌ కార్లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణను పొందాయి. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల విషయంలో ఎలాన్‌ మస్క్‌ను ట్యాగ్‌ చేస్తూ ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర పోస్ట్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అందులో ఎడ్ల బండి చిత్రాన్ని షేర్‌ చేశారు. ఖర్చు లేకుండా పూర్తి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ సామర్థ్యంతో ఇంకా గూగుల్‌ మ్యాప్స్‌ అవసరం లేకుండానే గమ్యస్థానాలకు చేర్చే ఒరిజినల్‌ టెస్లా వాహనం ఎద్దుల బండి అనే కాప్షన్‌ ఫోటోను ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫోటోతో టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ను ట్యాగ్‌ చేసి బ్యాక్‌ టూ ది ఫ్యూచర్‌ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. మహీంద్రా ట్వీట్ పై స్పందిస్తున్న కొంత మంది టెస్లా కారుకు సవాలు విసిరేది ఎడ్ల బండి మాత్రమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

గతంలో ఆనంద్‌ మహీంద్రా పునరుత్పాదక శక్తితో నడిచేకారు గురించి కూడా ఎలాన్‌ మస్క్‌ను ట్యాగ్‌ చేయగా..అప్పుడు మస్క్‌ దానికి రిప్లై కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఈ పోస్టుపై టెస్లా సీఈవో ఏమని స్పందిస్తారని అందరూ ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

NCP Leader: ప్రధాని మోడీ ఇంటి ఎదుట హనుమాన్‌ చాలీసా చదివేందుకు అనుమతి ఇవ్వండి.. హోం మంత్రికి లేఖ

Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలనుకుంటున్నారా..? ఐ20 రూ.5 లక్షల లోపే.. పూర్తి వివరాలు..!