AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: చాలా తక్కువ పెట్టబడితో ట్యూబురోస్ సాగు.. లక్షల్లో ఆదాయం.. అద్భుతమైన బిజినెస్‌ ఐడియా

మీరు చాలా తక్కువ డబ్బుతో వ్యాపారం ప్రారంభించాలనుకుంటే, అలాంటి వ్యాపార ఆలోచనను అందిస్తాము. అతి తక్కువ పెట్టుబడితో నెలకు లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇది ట్యూబెరోస్ పూల వ్యవసాయం వ్యాపారం. ట్యూబెరోస్ సువాసనగల పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ట్యూబెరోస్ పువ్వులు చాలా కాలం పాటు సువాసన, తాజాగా ఉంటాయి. అందువల్ల మార్కెట్‌లో వీటికి డిమాండ్‌ చాలా ఎక్కువ. ట్యూబెరోస్ (Polyanthus tuberosa Linn) మెక్సికోలో..

Business Idea: చాలా తక్కువ పెట్టబడితో ట్యూబురోస్ సాగు.. లక్షల్లో ఆదాయం.. అద్భుతమైన బిజినెస్‌ ఐడియా
Tuberose Farming
Subhash Goud
|

Updated on: Apr 11, 2024 | 11:12 AM

Share

మీరు చాలా తక్కువ డబ్బుతో వ్యాపారం ప్రారంభించాలనుకుంటే, అలాంటి వ్యాపార ఆలోచనను అందిస్తాము. అతి తక్కువ పెట్టుబడితో నెలకు లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇది ట్యూబెరోస్ పూల వ్యవసాయం వ్యాపారం. ట్యూబెరోస్ సువాసనగల పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ట్యూబెరోస్ పువ్వులు చాలా కాలం పాటు సువాసన, తాజాగా ఉంటాయి. అందువల్ల మార్కెట్‌లో వీటికి డిమాండ్‌ చాలా ఎక్కువ. ట్యూబెరోస్ (Polyanthus tuberosa Linn) మెక్సికోలో ఉద్భవించింది. ఈ పువ్వు అమరిల్లిడేసి కుటుంబానికి చెందిన మొక్క.

భారతదేశంలో పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో సాగు చేస్తారు. ఏ వాతావరణంలోనైనా సాగు చేయవచ్చు. ముఖ్యంగా నీటి వసతి బాగా ఉన్న చోటో సాగు చేసేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నీటి వ్యవస్థ లేకపోతే ఈ మొక్క పాడైపోతుంది.

ట్యూబురోస్ సాగు ఎలా?

సాగు చేసే ముందు ఎకరాకు 6-8 ట్రాలీల మంచి ఆవు పేడను పొలంలో వేయాలి. మీరు NPK లేదా DAP వంటి ఎరువులను కూడా ఉపయోగించవచ్చు. ఒక ఎకరంలో సుమారు 20 వేల దుంపలు పండిస్తారు. ఎల్లప్పుడూ తాజా, మంచి, పెద్ద దుంపలను నాటాలని గుర్తుంచుకోండి. తద్వారా మీరు పూల వ్యవసాయంలో మంచి దిగుబడిని పొందవచ్చు. భారతదేశంలో దాదాపు 20 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ట్యూబురోస్ పువ్వులు సాగు చేస్తున్నారు. ఇది ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణాఫ్రికా, అమెరికా మొదలైన దేశాలలో కూడా సాగు చేస్తున్నారు.

సంపాదన ఎంత ఉంటుంది?

మీరు ఒక ఎకరంలో ట్యూబురోస్ పువ్వులు సాగు చేస్తే, మీకు సుమారు 1 లక్ష కర్రలు (పువ్వులు) ట్యూబురోస్ పువ్వులు లభిస్తాయి. మీరు వాటిని సమీపంలోని పూల మార్కెట్లలో అమ్మవచ్చు. దగ్గరలో పెద్ద గుడి, పూల దుకాణాలు, కళ్యాణ వేదిక మొదలైనవి ఉంటే, అక్కడ నుండి మీరు పువ్వులకు మంచి ధరలను పొందవచ్చు. ట్యూబరోస్‌ ఒక పువ్వును డిమాండ్‌, సరఫరాను బట్టి రూ.1.5 నుంచి రూ.8 వరకు విక్రయిస్తున్నారు. అంటే కేవలం ఎకరంలో ట్యూబురోస్ పూల సాగు ద్వారా రూ.1.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఇది పెర్ఫ్యూమ్ తయారీలో కూడా ఉపయోగిస్తారట.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా