Business idea: గంటలో 3 వేల పానీ పూరీలు.. మార్కెట్లోకి సరికొత్త యంత్రం.. రిస్క్ లేకుండానే అదిరిపోయే సంపాదన..

|

Jun 09, 2023 | 9:19 AM

పానీ పూరీని ఎవరు ఇష్టపడరు? పానీ పూరీకి భారీ డిమాండ్‌ ఉంది. ఏదైనా చేయాలనే తపన ఉంటే, ఒక వ్యక్తి ఏదైనా సాధిస్తాడు. మీకు ఉత్సాహం ఉంటే, ఏదైనా క్లిష్ట పరిస్థితి నుండి బయటపడటానికి మీరు ఒక మార్గాన్ని కనుగొనవచ్చు. అహ్మదాబాద్ కు చెందిన ఈ యువకుడు పానీ పూరీ మేకర్ స్టార్టప్ ప్రారంభించి 11 కోట్ల టర్నోవర్ చేశాడు.

Business idea: గంటలో 3 వేల పానీ పూరీలు.. మార్కెట్లోకి సరికొత్త యంత్రం.. రిస్క్ లేకుండానే అదిరిపోయే సంపాదన..
Golgappa
Follow us on

ప్రతి ఒక్కరూ గొల్గప్పలను తినడానికి ఇష్టపడతారు. మనం పానీ పూరి అని పిలిస్తే.. ఉత్తరాదివారు గోల్ గప్పే అని పిలుస్తారు. ఇది మన దేశంలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. సాయంత్రం సమయంలో అలా బయటికి వెళ్లిన వాళ్లలో సగం మంది దీన్ని తినే ఇంటికి వస్తారు. రుచి కూడా అదిరిపోతుందిని తిన్నవారు అంటే వినాల్సిదే. అందుకే పానీ పూరికి అభిమానులు ఎక్కువే. ఉడికించిన బంగాళాదుంపలు, పుదీనా నీటితో ఆ రుచి నాలుకకు తెగ నచ్చేస్తుంది. భారతదేశ పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్కును సందర్శించినప్పుడు ‘గోల్-గప్పే’ తినిపించిన సంగతి తెలిసిందే. ఆ రుచు చూసిన తర్వాత మరో గోల్ గప్పే కావాలంటూ అడిగి మరీ తిన్నారు. అంటే దాని రుచి అంతలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ పానీ పూరీ తయారీ పాత పద్దతిలో తయారు చేసేందుకు ఇప్పుడు యంత్రాలు వచ్చాయి. ఇలా పానీ పూరీ తయారీ ఓ పరిశ్రమగా మారిపోయింది.

ఏ కాలంలో అయినా పానీపూరి మంచి బిజినెస్ అని చెప్పవచ్చు. పరిశుభ్రమైన వాతావరణంలో వాటిని చేసి అమ్మితే పెద్ద ఎత్తున మార్కెట్ ఉంది. పానీ పూరి తయారీలో గోధుమపిండి, గోధుమ రవ్వ, ఉడికించిన బంగాళదుంపలు, పుదీనా ఆకులు, ఉడికించిన శనగలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చింతపండు రసం, ఉప్పు, కారం, మామిడికాయ పొడి వాడతారు. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి అవసరమైనవి.

ఏదైనా చేయాలనే తపన ఉంటే, ఒక వ్యక్తి ఏదైనా సాధిస్తాడు. మీకు ఉత్సాహం ఉంటే, ఏదైనా క్లిష్ట పరిస్థితి నుండి బయటపడటానికి మీరు ఒక మార్గాన్ని కనుగొనవచ్చు. అందుకు ఈ యువకుడు సరైన ఉదాహరణ. అహ్మదాబాద్‌కు చెందిన ఓ యువకుడు తన ఆలోచనలను సాకారం చేసుకోవడానికి చదువుకుంటూనే పరిశోధన పత్రాల ద్వారా వచ్చిన డబ్బుతో చిన్న కంపెనీని ప్రారంభించాడు. కేవలం ఐదేళ్లలో 11 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిన కంపెనీ ఇది. ఈ కంపెనీ పానీపూరీ తయారీ యంత్రాలను తయారు చేస్తుంది.

అయితే అహ్మదాబాద్‌కు చెందిన ఆకాష్ గజ్జర్ అనే స్టార్టప్ దీన్ని తయారు చేయడానికి సులభమైన మార్గాన్ని కనుగొంది. ఈ యంత్రం గంటలో 3 వేల గోల్ గప్పాలను సిద్ధం చేస్తుంది. దీని ధర కూడా చాలా తక్కువ. అదే సమయంలో, ఇది 1 గంటలో 3000 నుండి 1.5 లక్షల పానీ పూరీలను రెడీ చేస్తుంది. పానీ పూరీ కోసం నీటిని తయారు చేయడానికి.. ఆకాష్ దాని పేస్ట్‌ను కూడా సిద్ధం చేశాడు. ఇది స్వచ్ఛమైన నీటితో కలిపితే.. పానీ పూరీకి కూడా నీరు అవుతుంది.

చిన్న చిన్న యంత్రాలు మాత్రమే కాకుండా ఇప్పటి పెద్ద పెద్ద యంత్రాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ఇందులో ఎలాంటి నూనెను ఉపయోగించకుండా పానీ పూరీని తయారు చేయవచ్చు. గంటలో 10 వేల గొల్గప్పను తయారుచేయవచ్చు. ఈ యంత్రాలను వైఫైలో కనెక్ట్ చేసినా అది సాఫీగా పనిచేస్తుంది. ఇంటికి పానీపూరీ మిషన్ కొనాలంటే 35 వేల నుంచి మొదలవుతుంది. దీంతో పానీపూరీని చేతితో తయారు చేయకుండా ఇప్పుడు చాలా మంది పానీపూరీ వ్యాపారులు కూడా ఈ తరహా యంత్రాల్లోనే తయారు చేస్తున్నారు. దీంతో వినియోగదారులకు స్వచ్ఛమైన పానీపూరీ లభిస్తుంది.

ఆకాష్ తన యంత్రాలన్నింటినీ పేటెంట్ కూడా పొందాడు. మీకు కావాలంటే మీరు దీన్ని కొనుగోలు చేసి, మీ షాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇలా మనం రెడీమెడ్ పానీ పూరీని తయారు చేసి మార్కెట్లో విక్రయించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఆర్డర్ పెట్టండి .. బిజినెస్ మొదలు పెట్టండి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం