Budget 2023: భారత్‌లో తొలి బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? వార్షిక బడ్జెట్‌ తేదీ, సమయాన్ని ఎందుకు మార్చారు?

|

Feb 01, 2023 | 11:19 AM

First Budget in India After Independence: జనవరి 31న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఉదయం 11 గంటలకు..

Budget 2023: భారత్‌లో తొలి బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? వార్షిక బడ్జెట్‌ తేదీ, సమయాన్ని ఎందుకు మార్చారు?
Union Budget
Follow us on

First Budget in India After Independence: జనవరి 31న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెతారు. అయితే బడ్జెట్‌పై ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. స్వాతంత్ర్యం అనంతరం మొదటి సారిగా బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెట్టారు..? అప్పటి బడ్జెట్‌ తేదీ, సమయాలను ఎందుకు మార్చారు? ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అతి తక్కువ మార్పులకు గురైంది బడ్జెట్‌ అని చెప్పుకోవచ్చు. స్వతంత్ర భారత దేశపు తొలి బడ్జెట్‌ను తొలి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముగం శెట్టి నవంబర్‌ 26, 1947న ప్రవేశపెట్టారు. సంవత్సరం చివరి రెండో నెలలో వచ్చిన బడ్జెట్‌ కాలక్రమంలో సంవత్సరం తొలి రెండో నెలకు వచ్చింది.

బ్రిటీష్‌ వలసవాద విధానాన్ని కొనసాగిస్తూ 1999 వరకు ఇండియాలో బడ్జెట్‌ ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి నెల చివరి పనిదినం రోజున సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. బ్రిటీష్‌ వారి టైమ్‌ జోన్‌ మన కంటే నాలుగున్నర గంటల వెనుక ఉంటుంది కాబట్టి బ్రిటీష్‌ వారి హయాంలో సాయంత్రం 5 గంటల సమయాన్ని నిర్ణయించారు. దీన్ని 1999లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా ఉదయం 11 గంటలకు మార్చారు. దీనికి కారణం లేకపోలేదు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత అందులో చేసే ప్రకటనలు, గణాంకాలు, కేటాయింపులపై మెరుగైన చర్చకు అవకాశం ఉంటుందనే ఉద్దేశం బడ్జెట్‌ ప్రవేశపెట్టే వేళను మార్చారు.

ఇక 2017లో ఈ సంప్రదాయానికి తెరదించారు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ. బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి ఒకటో తేదీకి మార్చారు. అంతే కాదు ప్రత్యేక రైల్వే బడ్జెట్‌కు కూడా మంగళం పాడారు. 2017కు ముందు 92 ఏళ్ల పాటు రైల్వే శాఖకు ప్రత్యేక బడ్జెట్‌ ఉండేది. 2021-22 నుంచి బడ్జెట్‌ మొత్తం పేపర్‌లెస్‌ డాక్యుమెంట్‌గా మార్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. బడ్జెట్‌ డాక్యుమెంట్స్‌ యాక్సెస్‌ చేసుకునేందుకు యూనియన్‌ బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌ ప్రస్తుతం అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

బడ్జెట్ 2023-24 లైవ్ అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి