
ప్రస్తుతం దేశంలో టెలికాం సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా దేశంలో మూడు ప్రధాన టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ఐడియా టారిఫ్ ధరలను పెంచిన క్రమంలో యూజర్లను ఆకర్షించే క్రమంలో వ్యాలిడిటీ పెంచడమో, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ అందిడచం లాంటి ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఇక ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సైతం ఈ రేసులో చేరింది. యూజర్లను అట్రాక్ట్ చేస్తూ రకరకాల రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ మరో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రూ. 599తో బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేటీ కంపెనీలకు పోటీనిచ్చే క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే యూజర్లు 5జీబీ డేటా పొందుతారు. అయితే ఎక్కువ రోజులు వ్యాలిడిటీ ఉండడం ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం. 84 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌ను అందిస్తున్నారు. 5జీబీ డేటాతో పాటు దేశంలోని అన్ని నెట్‌వర్క్స్‌కి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను చేసుకునే అవకాశం కల్పించారు.
అలాగే రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. దీంతో పటు ఇందులో మరో ఇంట్రెస్టింగ్ బెనిఫిట్ ఉంది. అదే అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు యూజర్లు అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు అదనంగా ఉచిత కాలర్‌ట్యూన్, జింగ్ యాప్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.
ఇదిలా ఉంటే ఎయిర్‌టెల్‌లో కూడా రూ. 599 ప్లాన్ అందుబాటులో ఉంది. అయితే ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3 జీబీ డేటా పొందొచ్చు. వ్యాలిడిటీ మాత్రం కేవలం 28 రోజులు మాత్రమే ఉంటుంది. అయితే ఏడాదిపాటు డిస్నీ + హాట్‌స్టార్ VIP ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చు. వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా పొందొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..