
BSNL Relaunches Freedom Plan: ప్రస్తుతం టెలికాం రంగంలో పోటీ ఆకాశాన్ని తాకుతోంది. ప్రైవేట్ టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను పెంచుతున్న తరుణంలో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సామాన్యులకు ఊరటనిచ్చే అద్భుతమైన ప్లాన్‌ను తీసుకువచ్చింది. గతంలో విశేష ఆదరణ పొందిన ‘బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్’ (BSNL Freedom Plan)ను సంస్థ మళ్లీ అందుబాటులోకి తెచ్చింది.
కేవలం ఒక్క రూపాయికే నెలంతా పండగే:
బీఎస్ఎన్ఎల్ తెలంగాణ తన అధికారిక ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ సంచలన ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ విశేషం ఏమిటంటే, కేవలం రూ. 1 చెల్లిస్తే చాలు పూర్తి 30 రోజుల పాటు మీరు అపరిమిత సేవలను ఆస్వాదించవచ్చు. వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా BSNL ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలు:
రూ. 1 ప్లాన్‌ను ఎంచుకున్న వారికి ఈ క్రింది ప్రయోజనాలు అందుతాయి:
ఎవరికి వర్తిస్తుంది?
ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో లేదు. కేవలం కొత్త వినియోగదారులకు (New Customers) మాత్రమే ఈ సమ్మర్ స్పెషల్ ఆఫర్ వర్తిస్తుందని BSNL స్పష్టం చేసింది. మీరు కొత్తగా BSNL నెట్‌వర్క్‌లోకి చేరాలనుకుంటే ఇది ఒక సువర్ణావకాశం.
గడువు ఎప్పటి వరకు?
ఈ ‘ఫ్రీడమ్ ప్లాన్’ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ ఆఫర్ ఏప్రిల్ 30, 2026 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది.
ఆఫర్‌ను ఎలా పొందాలి?
ఈ క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారు తమకు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా అధీకృత రిటైలర్ను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ మీరు మీ వివరాలను అందించి రూ. 1 కే కొత్త కనెక్షన్ పొందవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను కోరుకునే వారికి BSNL ఫ్రీడమ్ ప్లాన్ ఒక అద్భుతమైన ఎంపిక. ఏప్రిల్ నెలాఖరు వరకు మాత్రమే సమయం ఉన్నందున, ఆసక్తి గల వారు వెంటనే తమ సమీప కేంద్రాలను సందర్శించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: SBI: ఎస్బీఐలో రూ. 4 లక్షల డిపాజిట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత మీ చేతికి ఎంత వస్తుంది?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి