ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ప్రధాన టెలికం కంపెనీలన్నీ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఆగస్టు నాటికి దేశంలో 4జీ సేవలను తీసుకొచ్చేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా 4జీ సేవలకు సంబంధించిన ప్లాన్స్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వివరాలను వెల్లడించారు. ఇంతకీ BSNL అందిస్తోన్న ప్లాన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 395 రోజుల వ్యాలిడిటీ లభిస్తోంది. ఈ ప్లాన్‌తో ప్రతి రోజూ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. వీటితో పాటు ప్రతీ రోజూ 2 జీబీ డేటా పొందొచ్చు.
ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. మొత్తం 600 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు.
రూ. 997 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 160 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. ప్రతీరోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు.
రూ. 599 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే రూ. 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు. ప్రతీ రోజూ 3 జీబీ డేటా లభిస్తుంది.
ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 54 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. ప్రతీరోజూ 2 జీబీ డేటా పొందొచ్చు. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు.
రూ. 199తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. అలాగే ప్రతీ రోజూ 2 బీబీ లభిస్తుంది.
ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 26 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. మొత్తం 26జీబీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు.
రూ. 118 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 20 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. 10 జీబీ డేటా లభిస్తుంది. అలాగే 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు.
#BSNL introduces the ultimate mobile plans! Explore endless entertainment, gaming, music, and much more.https://t.co/PwNGfMLjMx
Download #BSNLSelfcareApp
Google Play: https://t.co/CVXLFIxtdH
App Store: https://t.co/0mzHyHZENB #BSNLOnTheGo #DownloadNow— BSNL India (@BSNLCorporate) July 4, 2024
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..