BSNL Plans: వాయిస్‌ ఓన్లీ ప్యాక్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ హవా.. ఇక వీఐ, ఎయిర్‌టెల్‌, జియోలకు చుక్కలే..!

ఇటీవల కాలంలో ఫోన్స్‌ వాడే వారి సంఖ్య పెరిగింది. ప్రతి ఫోన్‌లో రెండు సిమ్‌లు ఉండడం పరిపాటిగా మారింది. అయితే ఓ సిమ్‌లో నెట్‌ బ్యాలెన్స్‌ వేయించుకున్నాక రెండో సిమ్‌ యాక్టివేషన్‌లో ఉండాలంటే కచ్చితంగా అవసరం లేకపోయినా డేటా ప్యాక్‌తో ఉండే అన్‌లిమిటెడ్‌ ప్యాక్‌ను రీచార్జ్‌ చేయించాల్సి వస్తుంది. అందువల్ల ఇటీవల ట్రాయ్‌ వాయిస్‌ ఓన్లీ ప్యాక్‌లను లాంచ్‌ చేయాలని టెలికం కంపెనీలను ఆదేశించింది.

BSNL Plans: వాయిస్‌ ఓన్లీ ప్యాక్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ హవా.. ఇక వీఐ, ఎయిర్‌టెల్‌, జియోలకు చుక్కలే..!
బిఎస్ఎన్ఎల్ ఇటీవల 90 రోజుల చెల్లుబాటుతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళికలో వినియోగదారులు అపరిమిత కాలింగ్‌తో సహా అనేక ఇతర ప్రయోజనాలను పొందుతారు. ట్రాయ్‌ (TRAI) ఆదేశాన్ని అనుసరించి ప్రైవేట్ కంపెనీల మాదిరిగానే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కూడా అనేక వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను ప్రారంభించింది.

Updated on: Jan 28, 2025 | 2:40 PM

భారతదేశంలోని రెగ్యులేటరీ అథారిటీ అయిన ట్రాయ్‌  టెలికం కంపెనీలను వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌పై మాత్రమే దృష్టి సారించే ప్లాన్‌లను అందించమని ఆదేశించింది. ముఖ్యంగా డేటా అవసరం లేని చాలా మంది వినియోగదారులకు ఈ చర్యలు ఊరటనిస్తాయని పేర్కొంది. దీంతో జియో, ఎయిర్‌టెల్‌, వీఐ వంటి కంపెనీలు వాయిస్, ఎస్‌ఎంఎస్‌ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి. అయితే ఈ ప్లాన్‌లు రీచార్జ్‌ చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నదని వినియోగదారులు పెదవి వివరిస్తున్నారు.  బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్రాయ్‌ సూచనలకంటే ముందే వాయిస్‌ ఓన్లీ ప్యాక్స్‌ను పరిచయం చేసిందనే చాలా మందికి తెలియదు. గతంలో రూ.439 ప్లాన్‌ రిలీజ్‌ చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ వివరాలను చూద్దాం.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 439 ప్లాన్‌ ప్రస్తుతం భారతదేశంలో కేవలం వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌ కోసం అత్యంత సరసమైన ఎంపిక. ఈ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ 90 రోజులూ అపరిమిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ సేవలను ఆశ్వాదించవచ్చు. ఇదే వ్యాలిడిటీతో జియో రూ. 448, రూ. 1748 ధరతో రెండు ప్లాన్‌లను రిలీజ్‌ చేసింది. రూ.448 ప్లాన్‌ 84 రోజులు, రూ.1748 ప్లాన్‌ 336 రోజుల వ్యాలిడిటీను అందిస్తుంది. ఎయిర్‌టెల్ రూ. 469తో 84 రోజులు, రూ. 1849 ప్లాన్‌తో 365 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. వీఐ మాత్రం రూ. 1460 ప్లాన్‌తో 270 రోజుల వ్యాలిడిటీను అందిస్తుంది. 

అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌ ఇతర టెలికం కంపెనీ ప్లాన్‌లతో పోలిస్తే సరసమైనదిగా ఉండడంతో ఎక్కువ మంది ఈ ప్లాన్‌కు ఆకర్షితులవుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే సాధారణ వినియోగదారులు మాత్రం ఫీచర్‌ ఫోన్‌కు మాత్రమే అందుబాటులో ఉండేలా మరింత తక్కువ ధరతో ప్లాన్‌లను లాంచ్‌ చేయాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి