Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనం.. ఈ ఏడాదిలో తొలిసారి.. 900 పాయింట్లకు దిగువన సెన్సెక్స్

ఈ ఏడాది దేశీయ మార్కెట్లు తొలిసారి భారీగా పతనం అయ్యాయి. దేశంలో ప్రతికూల సంకేతాలు, అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు భారీ కుదుపులకు గురవుతన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో..

Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనం.. ఈ ఏడాదిలో తొలిసారి.. 900 పాయింట్లకు దిగువన సెన్సెక్స్

Updated on: Jan 27, 2021 | 3:03 PM

BSE Stock Market : ఈ ఏడాది దేశీయ మార్కెట్లు తొలిసారి భారీగా పతనం అయ్యాయి. దేశంలో ప్రతికూల సంకేతాలు, అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు భారీ కుదుపులకు గురవుతన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటు మదుపరులు కీలక రంగాల్లో లాభాలు స్వీకరిస్తుండడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.

ఇవే రెండు అంశాలు స్టాక్ మార్కెట్ల సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీసాయి. అంతేకాకుండా ప్రభుత్వరంగం సంస్థల ప్రైవేటీకరణ విధానంపై కేంద్రమంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంటుందంటూ వచ్చిన వార్తలు.. బ్యాంకింగ్, చమురు రంగ షేర్లను కుదేలు చేశాయి. ప్రధానరంగాల షేర్లు పతనమవుతుండడంతో సూచీలన్నీ భారీగా నష్టపోతున్నాయి. ముంబై  స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 900 పాయింట్లకుపైగా పతనమైంది. నిఫ్టీ 14,100 దిగువన ట్రేడ్ అవుతోంది. బుధవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో సెన్సెక్స్ 900పాయింట్లు దిగజారి 47,340 కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

Petrol, Diesel Prices : మరోసారి భగ్గుమన్న చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ ఎలా ఉన్నాయంటే..?

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే శారదాంబ కన్నుమూత.. అనారోగ్యంతో బాధపడుతూ మృతి

Loading...
Unable to load recommendations.
Follow Us