Cheapest Scooters: రూ. 50 వేలలోపు బెస్ట్ స్కూటర్లు.. పెట్రోల్, లైసెన్స్‌తో పన్లేదు.. ఓ లుక్కేయండి..

|

May 06, 2023 | 7:07 PM

దేశంలో ద్విచక్ర వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూపోతోంది. ఇప్పటిదాకా పెట్రోల్, డీజిల్ వాహనాలు మార్కెట్‌లోకి అందుబాటులో ఉండగా.. ఇప్పుడు సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ బైకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది.

Cheapest Scooters: రూ. 50 వేలలోపు బెస్ట్ స్కూటర్లు.. పెట్రోల్, లైసెన్స్‌తో పన్లేదు.. ఓ లుక్కేయండి..
Electric Scooters
Follow us on

దేశంలో ద్విచక్ర వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూపోతోంది. ఇప్పటిదాకా పెట్రోల్, డీజిల్ వాహనాలు మార్కెట్‌లోకి అందుబాటులో ఉండగా.. ఇప్పుడు సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ బైకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. అయితే మనం బండిని రోడ్డెక్కించాలంటే.. కచ్చితంగా లైసెన్స్ ఉండాలి. అయితే ఇప్పుడు మార్కెట్‌లోకి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొన్ని ఎలక్ట్రిక్ బైకులు వచ్చేశాయ్. మరి వాటి ధర, ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

  • అవాన్ ఈ ప్లస్:

మధ్యతరగతి ప్రజలకు చౌకైన ధరలో లభించే ఎలక్ట్రిక్ బైకుల్లో ఒకటి ‘అవాన్ ఈ ప్లస్’. ఈ వాహనం ధర రూ. 25 వేలు. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 50 కిమీ ప్రయాణం చేయవచ్చు. 48v/12ah కెపాసిటీ కలిగిన ఈ స్కూటర్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి 6.5 నుంచి 8 గంటల సమయం పడుతుంది.

  • డీటెల్ ఈజీ ప్లస్:

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 40 వేలు మాత్రమే. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 60 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్‌లో 1.25 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చబడి ఉంది. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.

  • ఆంపియర్ రియో ఎలైట్:

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 44,500. ఒక్క సింగిల్ ఛార్జ్‌తో ఈ వాహనాన్ని 60 కిమీ రైడ్ చేయవచ్చు. ఇది 20Ah లెడ్ యాసిడ్ బ్యాటరీ కలిగి ఉంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి 8 గంటల సమయం పడుతుంది.

  • లోహియా ఓమా స్టార్ లి:

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 41,444కి లభిస్తుంది. ఈ వెహికిల్ రైడింగ్ చేసేందుకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు. ఇందులో 48V/20 Ah బ్యాటరీ అమర్చబడి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కిమీ రేంజ్ అందిస్తుంది.