
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ సుంకాలపై చర్చలు జరిపిన తరువాత కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై సుంకాలను తగ్గిస్తోంది కేంద్రం. అందులో భాగంగానే అమెరికన్ బోర్బన్ విస్కీపై దిగుమతి సుంకాన్ని భారత్ 50 శాతానికి తగ్గించింది. అయితే, ఇతర మద్యం దిగుమతులపై మాత్రం ఎలాంటి తగ్గింపు ప్రతిపాదన లేదు. భారత్ బోర్బన్ విస్కీని ఎగుమతి చేసే ప్రధాన దేశం అమెరికా. భారత్ లోరి దిగుమతి చేసుకునే అటువంటి మద్యంలో దాదాపు నాలుగో వంతు వాటా కలిగి ఉంది.
బోర్బన్ విస్కీపై గతం సుకం 150 శాతం ఉండేది. 2023-24లో భారతదేశం 2.5 మిలియన్ డాలర్ల విలువైన బోర్బన్ విస్కీని భారత్ దిగుమతి చేసుకుంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 500 బిలియన్ డాలర్లకు పెంచాలని భారతదేశం, అమెరికా నిర్ణయించాయి. సుంకాలను తగ్గించడానికి కి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి ప్రణాళికలను ప్రకటించాయి. సుంకాలను తగ్గించడంతో పాటు మార్కెట్‌ను పెంచే లక్ష్యంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఒక ప్రణాళికను ప్రకటించారు.
2023-24లో భారత్ 2.5 మిలియన్ డాలర్ల విలువైన బోర్బన్ విస్కీని దిగుమతి చేసుకోనుంది. బోర్బన్ విస్కీ అనేది ప్రధానంగా మొక్కజొన్న నుండి తయారైన బ్యారెల్-ఏజ్డ్ అమెరికన్ విస్కీ. కేవలం ఇది మాత్రమే కాకుండా మరికొన్ని వస్తువులపై కూడా సుంకాన్ని తగ్గించే ఆలోచన కేంద్రానికి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి