
ఈ రోజుల్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుంటే, కేవలం సేవింగ్స్ ఖాతాల్లో డబ్బు ఉంచడం సరిపోదు. అందుకే చాలా మంది పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. సరైన ప్రణాళికతో పెట్టుబడి పెడితే 12–14 శాతం వరకు రాబడులు సాధ్యమనే నమ్మకం ఉన్నా, ఇవి గ్యారెంటీ కాదని గుర్తుంచుకోవాలి, మార్కెట్ పరిస్థితులపై పూర్తిగా ఆధారపడతాయి. గత ఐదేళ్ల పనితీరును చూస్తే ముఖ్యంగా PSU (ప్రభుత్వ రంగ సంస్థలు), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చెందిన ఫండ్లు అద్భుతమైన రాబడులు ఇచ్చాయి. కొన్ని ప్రముఖ ఫండ్లు ఇవి..
ఈ ఫండ్లలో పెట్టుబడి అంటే, మీరు నేరుగా పెద్ద కంపెనీలలో భాగస్వామ్యం అవుతున్నట్టే. ఉదాహరణకు SBI, NTPC, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు ఈ ఫండ్లలో ప్రధానంగా ఉంటాయి. అలాగే Larsen & Toubro, InterGlobe Aviation వంటి మౌలిక సదుపాయాల కంపెనీలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ ఆకట్టుకునే రాబడులు చూసి వెంటనే పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే ప్రతి అధిక రాబడి వెనుక కొంత ప్రమాదం కూడా ఉంటుంది. గత పనితీరు భవిష్యత్తులో కొనసాగుతుందని హామీ లేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి