Boarding Pass Fees: విమానంలో ప్రయాణించే వారికి శుభవార్త.. ఆ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు..!

|

Jul 22, 2022 | 7:02 PM

Boarding Pass Fees: విమానంలో ప్రయాణించే వ్యక్తులకు గుడ్‌న్యూస్‌. ఇప్పుడు ప్రయాణికులు విమానాశ్రయం చెక్-ఇన్ కౌంటర్లో బోర్డింగ్ పాస్ పొందడానికి ప్రత్యేక రుసుము చెల్లించాల్సిన అవసరం..

Boarding Pass Fees: విమానంలో ప్రయాణించే వారికి శుభవార్త.. ఆ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు..!
Boarding Pass Fees
Follow us on

Boarding Pass Fees: విమానంలో ప్రయాణించే వ్యక్తులకు గుడ్‌న్యూస్‌. ఇప్పుడు ప్రయాణికులు విమానాశ్రయం చెక్-ఇన్ కౌంటర్లో బోర్డింగ్ పాస్ పొందడానికి ప్రత్యేక రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఈ విషయంపై ట్వీట్ చేసి సమాచారం ఇచ్చింది. బోర్డింగ్ పాస్ పేరుతో ప్రయాణికుల నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయరాదని మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థలను ఆదేశించింది. వ్యక్తుల నుండి చెక్-ఇన్ కౌంటర్లలో బోర్డింగ్ పాస్‌ల కోసం విమానయాన సంస్థలు ప్రయాణికులకు విడివిడిగా వసూలు చేస్తున్నాయని విమానయాన మంత్రిత్వ శాఖకు సమాచారం అందిందని తెలిపింది.

బోర్డింగ్ పాస్ కోసం కంపెనీలు వసూలు:

ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లను జారీ చేయడానికి ఎయిర్‌లైన్స్ కంపెనీలు అదనంగా రూ.200 వసూలు చేస్తాయి. ఇంతకుముందు, ఈ విషయం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. ఆ తర్వాత మంత్రిత్వ శాఖ, ఈ విషయాన్ని గుర్తించి, ఇప్పుడు విమానయాన సంస్థలు ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లను జారీ చేయడానికి ఎటువంటి రుసుము వసూలు చేయలేవని స్పష్టం చేసింది. ఈ విషయంపై ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ కోసం విడిగా వసూలు చేస్తున్నట్లు MoCA దృష్టికి వచ్చిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. అటువంటి పరిస్థితిలో, ఏవియేషన్ రూల్స్ 1937 (ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, 1937) ప్రకారం, విమానయాన సంస్థలు ప్రయాణికుల నుండి బోర్డింగ్ పాస్ కోసం ఎటువంటి ప్రత్యేక రుసుమును వసూలు చేయరాదని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

గత కొన్నేళ్లుగా విమానాల్లో అనేక సాంకేతిక లోపాలు తెరపైకి వచ్చాయి. దీంతో విమానాలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంపై మంత్రిత్వ శాఖ సీరియస్‌గా తీసుకున్న విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమావేశం నిర్వహించి ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని కంపెనీలను ఆదేశించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి