Blinkit: బ్లింకిట్ కీలక ప్రకటన.. కేవలం 10 నిమిషాల్లోనే ఆపిల్ ప్రోడక్ట్‌లు డెలివరీ

Blinkit Delivery: దేశంలో టెక్నాలజీ పెరిగిపోయింది. ఒప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే షాపులకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఇన్‌స్టంట్‌ డెలివరీ సేవలు వేగవంతమవుతున్నాయి. కేవలం పది నిమిషాల్లోనే డెలివరీ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. నిమిషాల్లోనే వివిధ సరుకులు డెలివరీ చేయడం క్రేజ్ నిరంతరం పెరుగుతోంది..

Blinkit: బ్లింకిట్ కీలక ప్రకటన.. కేవలం 10 నిమిషాల్లోనే ఆపిల్ ప్రోడక్ట్‌లు డెలివరీ

Updated on: Feb 28, 2025 | 7:06 AM

నిమిషాల్లోనే వివిధ సరుకులు డెలివరీ చేయడం క్రేజ్ నిరంతరం పెరుగుతోంది. బ్లింకిట్ కూడా తన సేవలను నిరంతరం మెరుగుపరుచుకుంటోంది. దీనికి సంబంధించి కంపెనీ ఆపిల్ ఉత్పత్తులను డెలివరీ చేస్తామని కూడా పేర్కొంది. ఇప్పుడు మ్యాక్‌బుక్, ఐప్యాడ్, ఇతర ఆపిల్ ఉత్పత్తులను కేవలం 10 నిమిషాల్లో వినియోగదారులకు డెలివరీ చేస్తామని కంపెనీ CEO అల్బిందర్ దిండ్సా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియాలో వెల్లడించారు.

ఈ నగరాల్లో డెలివరీ:
ఆయన x లో “బ్లింకిట్‌లో కొత్త ప్రయోగం” అని పేర్కొన్నారు. మీరు ఇప్పుడు MacBook Air, iPad, AirPods, Apple Watch, ఇతర Apple ఉపకరణాలను 10 నిమిషాల్లో డెలివరీ చేసుకోవచ్చు! మేము ఢిల్లీ NCR, ముంబై, హైదరాబాద్, పూణే, లక్నో, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, జైపూర్, బెంగళూరు, కోల్‌కతాలో డెలివరీలను ప్రారంభించాము! ఈ ఆపిల్ ఉత్పత్తులు ఇప్పుడు డెలివరీకి అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలియజేసింది. కానీ కొన్ని చోట్ల ‘త్వరలో డెలివరీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు.

 

బ్లింకిట్ వినియోగదారులు ఇప్పటికే ఐఫోన్‌ల వంటి స్మార్ట్‌ఫోన్‌లను, గేమింగ్ కన్సోల్‌లు, కీబోర్డులు మొదలైన ఇతర సాంకేతిక ఉత్పత్తులను 10 నిమిషాల్లో డెలివరీ పొందవచ్చు. ఈ ఆపిల్ ఉత్పత్తులు ఇప్పుడు డెలివరీకి అందుబాటులో ఉన్నాయని ధిండ్సా చెప్పినప్పటికీ, ఐప్యాడ్ 10 జనరేషన్‌, ఆపిల్ ఇయర్‌పాడ్‌లు వంటి కొన్ని ఉత్పత్తులు ముంబైలోని కొన్ని ప్రదేశాలలో యాప్‌లో త్వరలో వస్తున్నాయని చెప్పారు. మాక్‌బుక్, ఐప్యాడ్, ఇతర ఆపిల్ ఉత్పత్తులను కేవలం 10 నిమిషాల్లో వినియోగదారులకు డెలివరీ చేస్తే, అది కంపెనీకి పెద్ద విజయం అవుతుందన్నారు. ఈ కంపెనీ ఢిల్లీ NCR, ముంబై, హైదరాబాద్, పూణే, లక్నో, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, జైపూర్, బెంగళూరు మరియు కోల్‌కతాలో ఈ డెలివరీని ప్రారంభించింది.

ఇది కూడా చదవండి: Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి