Bitcoin: రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతోన్న బిట్ కాయిన్.. గతంలో ఇన్వెస్ట్ చేసినవాళ్లకు సిరుల పంట

|

Mar 14, 2021 | 5:09 PM

బిట్‌కాయిన్‌ ఆల్‌టైమ్ హైకి చేరింది. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతోంది. అమెరికా వ్యాక్సిన్‌ చర్యలతో కొత్త హైట్స్‌కు చేరింది. క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ రికార్డులు తిరగరాస్తూ...

Bitcoin: రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతోన్న బిట్ కాయిన్.. గతంలో ఇన్వెస్ట్ చేసినవాళ్లకు సిరుల పంట
Bitcoin
Follow us on

bitcoin investment:  బిట్‌కాయిన్‌ ఆల్‌టైమ్ హైకి చేరింది. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతోంది. అమెరికా వ్యాక్సిన్‌ చర్యలతో కొత్త హైట్స్‌కు చేరింది. క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతోంది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బిట్‌కాయిన్‌ మరో ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. బిట్‌కాయిన్ చరిత్రలో తొలిసారిగా, 60,000 డాలర్లను అధిగమించింది. ఇటీవల కరెక్షన్‌ తరువాత మరింత పుంజుకున్న బిట్‌ కాయిన్‌ తాజా రికార్డును నమోదు చేసింది. డేటా ప్లాట్‌ఫామ్ ట్రేడింగ్ వ్యూ ప్రకారం 60,170 వద్ద ట్రేడవుతోంది. కాగా క్రిప్టోకరెన్సీ ఫిబ్రవరి 21 న, 57,432 వద్దకు ఆల్‌ టైం రికార్డు స్థాయిని తాకింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా మహమ్మారి-ఉపశమన చట్టంపై సంతకం చేసిన తరువాత ఆర్థిక మార్కెట్లలో నెలకొన్న ఆశలు ఈ పరిణామానికి దారితీసిందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు డాల‌ర్ బ‌ల‌హీన ప‌డటంతోపాటు ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఈ తరుణంలో ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ పెట్టుబ‌డి మార్గంగా ఉన్న బంగారానికి చెక్‌పెట్టే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే క్రిప్టో క‌రెన్సీపై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే బిట్‌ కాయిన్‌తోపాటు.. మరికొన్ని క్రిప్రోకరెన్సీలు కూడా పెరుగుతూపోతున్నాయి. ఎక్స్‌ఆర్‌పీ, డోజ్‌, ఎథీరియం, డాష్‌ కాయిన్లు కూడా జోష్‌లో ఉన్నాయి. ఒక్కరోజులోనే రెండు నుంచి ఐదు శాతం వరకు లాభాలను గడించాయి. మరోవైపు డిజిటల్‌ పేమెంట్లు ఊపందుకుంటున్న సమయంలో.. క్రిప్టోకరెన్సీలు కూడా డిజిటల్‌ పేమెంట్స్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. ఇక ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ బిట్‌కాయిన్‌లో భారీ పెట్టుబడులతోనూ క్రిప్టోకరెన్సీకి మరింత జోష్‌ వచ్చింది.

Also Read:

Tadipatri Municipality: ఊరి మంచి కోసం జగన్‌ను కలిసేందుకు సిద్దం.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hindupur municipality: బాలయ్యకు చెక్.. హిందూపురంలో వైసీపీ ఏకపక్ష విజయం