Indian Railways: అరుణాచలం వెళ్లేవారికి రైల్వేశాఖ భారీ శుభవార్త.. ఇకపై రెగ్యూలర్ సర్వీసులు.. ఈ రూట్లోనే..

రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నర్సాపురం నుంచి అరుణాచలం, బెంగళూరు వెళ్తున్న ప్రత్యేక రైళ్లను రెగ్యూలర్ ట్రైన్లుగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏపీలోని ప్రయాణికులకు ఊరట కలగనుంది. జులై 1వ తేదీ నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ వివరాల్లోకి వెళ్తే..

Indian Railways: అరుణాచలం వెళ్లేవారికి రైల్వేశాఖ భారీ శుభవార్త.. ఇకపై రెగ్యూలర్ సర్వీసులు.. ఈ రూట్లోనే..
Indian Railways

Updated on: Jun 23, 2026 | 7:11 AM

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త అందించింది రైల్వేశాఖ. నర్సాపురం నుంచి నడుస్తున్న ప్రత్యేక రైళ్లను రెగ్యూలర్ ట్రైన్లుగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. జులై 1వ తేదీ నుంచి రెగ్యూలర్ సర్వీసుగా తిరగనుంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటం, డిమాండ్ ఎక్కువగా ఉన్న క్రమంలో కనెక్టివిటిని మెరుగుపర్చేందుకు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది. నర్సాపురం, బెంగళూరు, అరుణాచలం వెళ్లే ప్రత్యేక రైళ్లను శాశ్వత రైళ్లుగా మార్చారు.

జులై 1 నుంచి మార్పులు

నర్సాపురం– తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్(17291 ) ప్రతి బుధవారం మధ్యాహ్నం 13:00 గంటలకు నర్సాపురంలో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 04:55 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో తిరువణ్ణామలై- నర్సాపురం ఎక్స్‌ప్రెస్ (17292 ) ప్రతి గురువారం ఉదయం 11:00 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 02:00 గంటలకు నర్సాపురం చేరుకుంటుందని రైల్వేశాఖ వెల్లడించింది. పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, వెల్లూరు కాంట్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.

అరుణాచలం వెళ్లేవారికి శుభవార్త

నరసాపురం-బెంగళూరు- నరసాపురం(17293) సర్వీసును కూడా రెగ్యూలర్ చేశారు. 2026 జూలై 3వ తేదీ నుంచి ఈ రైలు శాశ్వతంగా అందుబాటులోకి రానుంది. ఇది ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 15:50 గంటలకు నర్సాపురంలో బయల్దేరి మరుసటి రోజ ఉదయం 09:45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం ఉదయం 11:00 గంటలకు బెంగళూరులో బయల్దేరి.. మరుసటి రోజు తెల్లవారుజామున 06:00 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. ఈ రైలు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్టై, కుప్పం, బంగారపేట, కృష్ణరాజపురం మీదుగా వెళుతుంది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us