SBI: మీ ఫోన్‌కు ఈ మెసేజ్ వచ్చిందా.? జర జాగ్రత్త! లేకుంటే ఖాతా ఖాళీ అయినట్లే..

|

Feb 20, 2023 | 8:55 PM

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో ఖాతా ఉందా.? అలా అయితే ఈ వార్త మీకోసమే. SBI ఖాతాదారులకు OTP లేదా ఏదైనా..

SBI: మీ ఫోన్‌కు ఈ మెసేజ్ వచ్చిందా.? జర జాగ్రత్త! లేకుంటే ఖాతా ఖాళీ అయినట్లే..
యువ డెబిట్ కార్డ్, గోల్డ్ డెబిట్ కార్డ్, కాంబో డెబిట్ కార్డ్ లేదా మై కార్డ్ (ఇమేజ్) డెబిట్/ATM కార్డ్‌తో సహా ఈ డెబిట్/ATM కార్డ్‌లలో దేనినైనా ఉపయోగించే వ్యక్తుల నుంచి SBI వార్షిక నిర్వహణ రుసుముగా రూ. 175 వసూలు చేస్తుంది.
Follow us on

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో ఖాతా ఉందా.? అలా అయితే ఈ వార్త మీకోసమే. SBI ఖాతాదారులకు OTP లేదా ఏదైనా సేవలకు సంబంధించిన సమాచారం తరచూ మెసేజ్‌ల రూపంలో వస్తుంటాయి. అయితే కేటుగాళ్లు ఇప్పుడు అమాయకులను మోసం చేసేందుకు వీటిని ఎరగా వాడుతున్నారు. అనే రకాల నకిలీ మెసేజ్‌లను వినియోగదారులకు పంపించి.. లింక్ క్లిక్ చేయాలంటూ కోరుతున్నారు. కస్టమర్‌లు పొరపాటున లేదా ఆత్రుతలో ఆ లింక్‌పై క్లిక్ చేస్తే.. క్షణాల్లో వారి ఖాతా ఖాళీ అయినట్లే. ఇటీవల ఎస్‌బీఐ నుంచి చాలామందికి ఓ మెసేజ్ వచ్చింది. ఇక దానిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది.

‘డియర్ యూజర్! మీ యోనో ఖాతా బ్లాక్ చేయబడింది. వెంటనే పాన్ నెంబర్ అప్‌డేట్ చేయండి. అందుకోసం కింద లింక్ క్లిక్ చేయండి’.. ఈ మెసేజ్ ఇంటర్నెట్‌లో తెగ హల్చల్ చేస్తోంది. ఇక దీనిపై స్పందించిన పీఐబీ.. అది పూర్తిగా అవాస్తవం అని.. ఎవ్వరూ నమ్మొద్దని పేర్కొంది. ఏదైనా ఈ-మెయిల్ లేదా SMS రూపంలో ఏ బ్యాంక్ అయినా కూడా మీ వ్యక్తిగత వివరాలను అడగదు. అలా ఏది వచ్చినా.. అది ఫేక్ అని నిర్ధారించండి. మీకు అలాంటి SMS ఏదైనా వస్తే, వెంటనే దాన్ని report.phishing@sbi.co.in కి నివేదించండి. కాగా, SBI తన కస్టమర్లకు అలాంటి సందేశం పంపదని పీఐబీ స్పష్టం చేసింది.