Fixed Deposit: ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంది. అందుకే చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లను (FD) సురక్షితమైన పెట్టుబడి భావిస్తున్నారు. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల లిక్విడిటీ పెరుగుతుంద. మంచి వడ్డీని పొందుతారు. మహమ్మారి సమయంలో ఎమర్జెన్సీ కార్ప్స్‌ను సిద్ధం చేయడంలో సేవింగ్స్ విపరీతంగా పనిచేస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 4 శాతం వద్దే ఉంచింది. చాలా బ్యాంకులు FDపై వడ్డీ రేటును తగ్గించాయి. అయితే అనేక చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, చిన్న ప్రైవేట్ బ్యాంకులు FDలపై 7 శాతం వరకు వడ్డీ రేటును చెల్లిస్తున్నాయి. మూడు సంవత్సరాల కాలవ్యవధితో FDలపై ఎక్కడ వడ్డీ ఎక్కడ లభిస్తుందో తెలుసుకుందాం.
1. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్ల FDపై 7 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో ఈ బ్యాంకు ఉత్తమ వడ్డీ రేటును కలిగి ఉంది. ఇందులో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత అది మూడేళ్ల తర్వాత 1.23 లక్షల రూపాయలు అవుతుంది. ఇందులో కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి.
2. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్ల FDపై 6.5 శాతం వడ్డీ రేటును కలిగి ఉంది. ఇందులో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మూడేళ్లలో ఆ మొత్తం 1.21 లక్షల రూపాయలకు పెరుగుతుంది. దీనికి కనీసం రూ.1,000 పెట్టుబడి అవసరం.
3. RBL బ్యాంక్
ప్రస్తుతం ఈ ప్రైవేట్ బ్యాంక్‌లో మూడేళ్ల కాలపరిమితి కలిగిన FDలపై 6.30 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది. ఇందులో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మూడేళ్లలో 1.21 లక్షల రూపాయలకు పెరుగుతుంది.
4. యెస్ బ్యాంక్
యెస్ బ్యాంక్ మూడేళ్ల FDపై 6.25 శాతం వడ్డీ రేటును కలిగి ఉంది. ఇందులో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మూడేళ్లలో ఆ మొత్తం రూ.1.20 లక్షలు అవుతుంది. దీనికి కనీసం రూ.10,000 పెట్టుబడి కావాలి.
5. ఇండస్ఇండ్ బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈ బ్యాంకులు మూడేళ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 6 శాతం వడ్డీ రేటును కలిగి ఉన్నాయి. ఇందులో రూ.లక్ష పెట్టుబడి పెడితే మూడేళ్లలో ఆ మొత్తం రూ.1.19 లక్షలకు పెరుగుతుంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో కనీస పెట్టుబడి రూ. 10,000, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో రూ.1,000 అవసరం.