Best Electric Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ.. అద్భుతమైన ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్!

Best Electric Scooter: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి రాగా, మరిన్ని రానున్నాయి. ప్రస్తుతం పెట్రోల్‌ వాహనాల కంటే ఎలక్ట్రిక్‌ వాహనాలకు..

Best Electric Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ.. అద్భుతమైన ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్!
Best Electric Scooter

Updated on: Jun 28, 2026 | 9:57 AM

Best Electric Scooter: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. ఓలా, అథర్‌లకు పోటీగా బిగాస్ (BGauss) అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి రాగా, మరిన్ని రానున్నాయి. ప్రస్తుతం పెట్రోల్‌ వాహనాల కంటే ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ అధికంగా పెరుగుతుండటంతో కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్‌ స్కూటర్లను తీసుకువస్తున్నాయి. ఇక బిగాస్ ఇ-స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది.

ఈ BGauss C12 ఇ-స్కూటర్‌లో 3 వేరియంట్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ. 1 లక్ష 11 వేల 989. టాప్ వేరియంట్ ధర రూ. 1 లక్ష 34 వేల 989. ఇందులో 2, 2.7 kWh బ్యాటరీలతో కూడిన వేరియంట్లు ఉన్నాయి. ఇది కనీసం 85 కిలోమీటర్ల నుండి గరిష్టంగా 123 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది నలుపు, ఆకుపచ్చ, తెలుపు, ఆకుపచ్చ-తెలుపు, పసుపు వంటి రంగులలో లభిస్తుంది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. CBS బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. లిథియం ఐరన్ బ్యాటరీ అమర్చింది కంపెనీ. ముందు, వెనుక డ్రమ్ బ్రేకులు, స్టీల్ వీల్స్ ఉన్నాయి. దీని బరువు 106 కేజీలు.

ఇది కూడా చదవండి: Gold Rates: బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి..? నగలు కొనేటప్పుడు ఈ విషయాలు మర్చిపోవద్దు

ఇవి కూడా చదవండి

ఈ BGauss Oowah ఇ-స్కూటర్ ధర రూ. 99,489. ఇది 2 వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 2.3 kWh, 3 kWh బ్యాటరీ అమర్చబడి ఉంది. దీని ధరలు వరుసగా రూ. 99,489, రూ.1,27,989. ఇది ఆకుపచ్చ, లేత నీలం, తెలుపు రంగులలో అందుబాటులో ఉంది. ఇది ఒకే ఛార్జ్‌పై 145 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. దీని బరువు 97 కేజీలు, 104 కేజీలు. దీనికి CBS బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. దీనికి ముందు, వెనుక డ్రమ్ బ్రేకులు అమర్చబడి ఉన్నాయి. దీనికి స్టీల్ వీల్స్ అమర్చబడి ఉన్నాయి. ఇది హైడ్రాలిక్ టెలిస్కోపిక్ ఫోర్క్, డబుల్ హైడ్రాలిక్ స్ప్రింగ్ సస్పెన్షన్స్‌తో వస్తుంది.

స్కూటర్ ధర:

BGauss BG RUV 350 ఇ-స్కూటర్ ధర రూ. 1,52,989. ఇది ఒకే ఛార్జ్‌పై 145 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది తెలుపు, క్రిమ్సన్, గ్రే, నలుపు మరియు నేవీ బ్లూ రంగులలో లభిస్తుంది. దీనిలో 3 kWh బ్యాటరీ అమర్చబడింది. ఇది CBS బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. దీనికి ముందు, వెనుక డ్రమ్ బ్రేకులతో పాటు అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీని బరువు 122 కేజీలు.

సౌకర్యాలు:

ఈ BGauss ఇ-స్కూటర్లలో బ్లూటూత్ సౌకర్యం ఉంది. GPS సౌకర్యం అందుబాటులో ఉంది. ఓడోమీటర్, స్పీడోమీటర్ డిజిటల్ సౌకర్యం అందుబాటులో ఉంది. ట్రిప్‌మీటర్ డిజిటల్. తక్కువ బ్యాటరీ సూచిక, స్టాండ్ అలారం, కాల్/SMS హెచ్చరిక సౌకర్యం అందుబాటులో ఉంది. సెల్ఫ్ స్టార్ట్ సౌకర్యం అందుబాటులో ఉంది. LED హెడ్‌లైట్స్‌తో వస్తుంది.

ఇది కూడా చదవండి:Best Camera Phones: కంటెంట్ క్రియేటర్స్, వీడియో మేకర్స్ కోసం టాప్ 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే!

ఇది కూడా చదవండి: Bank FD: మీరు ఈ బ్యాంకులో రూ.5 లక్షల ఎఫ్‌డీ చేస్తే 60 నెలల్లో ఎంత ఆదాయం వస్తుంది?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us