Credit Card Benefits: కరోనా మహమ్మారి (Covid-19 Pandemic) తగ్గుముఖం పట్టింది. అలాగే వేసవి సెలవులు కూడా వచ్చాయి. ఇక తాజాగా విడుదలైన సినిమాని (Movie) థియేర్లకు వెళ్లి చూడాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. చాలా మంది ఫ్యామిలీలతో కలిసి సినిమాలకు వెళ్తుంటారు. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పడంతోపాటు ఇటీవల విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు భారీ విజయాన్ని అందుకోవడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు ఇలా ఎంతో మంది సినిమా థియేటర్లకు వెళ్లి చూశారు. మీరు కూడా సినిమాలను చూడటం ఇష్టపడితే క్రెడిట్ కార్డ్‌ల ద్వారా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎంచుకున్న క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి సినిమా టిక్కెట్‌లను బుక్ చేసుకుంటే, మీరు ఉచిత సినిమా టిక్కెట్, అదనపు తగ్గింపు, క్యాష్‌బ్యాక్ మొదలైన మంచి ప్రయోజనాలను పొందవచ్చు. మీరు ప్రయోజనాలను పొందే అత్యుత్తమ క్రెడిట్ కార్డ్‌లను తెలుసుకుందాం.
కోటక్ డిలైట్ ప్లాటినం క్రెడిట్ కార్డ్:
ఈ క్రెడిట్ కార్డ్‌లో మీరు ఒక నెలలో ఫుడ్, వినోద విభాగాలలో రూ. 10,000 ఖర్చు చేసిన తర్వాత సినిమా టిక్కెట్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇందులో సంవత్సరానికి రూ. 1.25 లక్షలు ఖర్చు చేస్తే నాలుగు ఉచిత PVR టిక్కెట్లు లేదా రూ. 750 క్యాష్‌బ్యాక్ వస్తుంటుంది. ఈ క్రెడిట్ కార్డ్‌పై వార్షిక రుసుము రూ. 299.
యాక్సిస్ మై జోన్ క్రెడిట్ కార్డ్:
ఈ క్రెడిట్ కార్డ్ Paytm మూవీస్‌లో ఇతర సినిమా టిక్కెట్లపై 100% తగ్గింపును అందిస్తుంది. ఇది సోనీ లైవ్ ప్రీమియమ్‌కు వార్షిక సబ్‌స్క్రిప్షన్, AJIOలో కనీసం రూ.2,000 ఖర్చుపై ఫ్లాట్ రూ.600 తగ్గింపు ఉంటుంది. భారతదేశంలోని పార్టనర్ రెస్టారెంట్‌లలో 20% వరకు తగ్గింపును కూడా కలిగి ఉంటుంది. సినిమా టిక్కెట్లు, వినోద విభాగంలో ప్రయోజనాలతో పాటు, భారతదేశంలోని ఎంపిక చేసిన విమానాశ్రయ లాంజ్‌లకు ప్రతి త్రైమాసికంలో యాక్సెస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డుపై వార్షిక రుసుము రూ. 500.
PVR కోటక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్:
ఈ క్రెడిట్ కార్డు ద్వారా రూ.10,000 ఖర్చు చేసిన ప్రతి నెలా రెండు సినిమా టిక్కెట్లు వస్తాయి. ఇందులో PVR బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా టిక్కెట్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్, ఫుడ్, పానీయాలపై 15 శాతం క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. ఈ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము రూ. 999.
HDFC బ్యాంక్ ప్లాటినం టైమ్స్ క్రెడిట్ కార్డ్:
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్లాటినం టైమ్స్ క్రెడిట్ కార్డ్ బుక్‌మైషోలో బుక్ చేసుకున్న సినిమా టిక్కెట్లపై 25% తగ్గింపును అందిస్తుంది. ఇందులో ప్రతి లావాదేవీపై రూ.350 వరకు ఆదా అవుతుంది. వినియోగదారులు ఫుడ్‌పై ఖర్చు చేసే ప్రతి రూ.150కి 10 రివార్డ్ పాయింట్లు, ఇతర కేటగిరీల్లో ఖర్చు చేసే ప్రతి రూ.150కి మూడు రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఈ క్రెడిట్ కార్డుపై వార్షిక రుసుము రూ. 1,000.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి