Best Mileage Cars: 7 లక్షల లోపు ఎక్కువ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..

|

Dec 30, 2022 | 6:51 AM

మార్కెట్లోకి కొత్త కొత్త కార్లు వస్తున్నాయి. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ రేట్స్ విచ్చలవిడిగా పెరుగుతుండడంతో వినియోగదారులంతా అధిక మైలేజ్ ఇచ్చే కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. వినియోగదారుల..

Best Mileage Cars: 7 లక్షల లోపు ఎక్కువ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..
Follow us on

మార్కెట్లోకి కొత్త కొత్త కార్లు వస్తున్నాయి. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ రేట్స్ విచ్చలవిడిగా పెరుగుతుండడంతో వినియోగదారులంతా అధిక మైలేజ్ ఇచ్చే కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగా కార్లను తయారు చేస్తున్నాయి కంపెనీలు. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలకు అనుగుణంగా ఉండేలా వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. తక్కువ ధరల్లోనే కార్లను తయారు చేస్తుండటం విశేషం. అంతేకాకుండా మార్కెట్లో ప్రస్తుతం అధిక మైలేజీ ఉన్న కార్లన్నీ తక్కువ ధరల్లోనే లభిస్తుంది. ఇప్పుడు రూ.7 లక్షలలోపే అధిక మైలేజీ ఇచ్చే కార్లు మార్కెట్లో విడులవుతున్నాయి.

రూ.7 లక్షల్లోపే ఎక్కువ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..

మారుతి సుజుకి స్విఫ్ట్: మార్కెట్లో మారుతి సుజుకికి మంచి ఆదరణ ఉంది. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే కార్లు ఈ కంపెనీ నుంచి చాలా వస్తుంటాయి. మారుతి కార్లలో స్విఫ్ట్‌ కారు ఒకటి. ఇది రూ.5.91 లక్షలు కాగా, ఇందులో రూ.8.84 లక్షల వరకు ఉన్నాయి. సామాన్య ప్రజలకు తక్కువ ధరల్లో లభ్యమవుతున్నాయి. ఈ కారు 1.2 డ్యూయల్ జెట్ ఇంజన్ సామర్థ్యంతో ఉంటుంది. ఈ కారు మైలేజీ దాదాపు 22 నుంచి 23 కిలోమీటర్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ కారులో అత్యాధునిక టెక్నాలజీని సైతం అందించింది కంపెనీ.

మారుతీ సుజుకీ ఎస్‌ప్రెసో: ఈకారుకు కూడా మంచి మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. దీని ధర రూ.4.25 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు మైలేజీ విషయానికొస్తే లీటరుకు 32 కిలోమీటర్ల మేర ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మారుతి సుజుకీ ఆల్టోకారు: ఈ కారు ధర రూ.3.39 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు 22 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. ఈ కారుకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. సామాన్యులకు సైతం అందుబాటు ధరలో ఉండే విధంగా కంపెనీ రూపొందించింది.

హ్యుండై గ్రాండ్ ఐ10: ఈ కారు కూడా మార్కెట్లో బాగానే ఉంది. అత్యధికంగా విక్రయించే కార్లలో హ్యుండై కంపెనీ ఒకటి. ఇది పాత మోడల్ కంటే పది రెట్ల అప్‌డేట్‌తో ప్రస్తుతం మార్కెట్లో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. కొత్త కొత్త హంగులతో చాలా రంగుల వేరియంట్లతో భారత మార్కెట్లో లభిస్తోంది. దీని ధర మారుతి సుజుకి స్విఫ్ట్ కంటే చాలా తక్కువకే లభిస్తుంది. రూ.5.42 లక్షలు నుంచి రూ. 8.51 లక్షలతో భారత్‌లో అమ్మకాలు భారీగా ఉన్నాయి. దీనికి అత్యాధునిక ఫీచర్స్‌తో పాటు ఇంజన్ సామర్థ్యాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ఈ కారు మైలేజీ దాదాపు 20 నుంచి 22 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. ఈ కారు మధ్య తరగతి వారికి అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి.

రెనో క్విడ్‌: ఈ కారుకు మంచి ఆదరణ ఉంది. ఈ కారు ధర రూ.4.64 లక్షల వరకు ఉంది. దీని మైలేజీ 22 కిలోమీటర్ల వరకు ఉంది.

ఈ కార్లే కాకుండా మరెన్నో ఉన్నాయి. మారుతీ వేగనార్‌, మారుతీ సెలెరియో, టాయోటా గ్లాంజా, హ్యుందాయ్‌ శాంట్రో, హ్యుందాయ్‌ ఆరా, టాటా టిగోర్‌ తదితర కార్లు కూడా మంచి మైలేజీని అందిస్తాయి. అయితే ఈ కార్లు రూ.5 లక్షలకుపైగానే ఉన్నాయి. అలాగే కారు ధర పెరిగేకొద్ది ఫీచర్స్‌ కూడా ఎక్కువగానే ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి