Business Idea: ఈ వ్యాపారంతో నెలకు రూ. లక్ష పక్కా.. ఎలా ప్లాన్‌ చేయాలంటే..

|

Feb 26, 2024 | 5:25 PM

చిన్న చిన్న మిషన్‌లతో ఇంటి వద్దే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి నెలకు రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. ఇంతకి ఈ బిజినెస్‌ను ఎలా ప్రారంభించాలి.? ఎంత ఖర్చవుతుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాపారానికి ప్రధానంగా ఆయిల్ ఎక్స్ పెల్లర్ మెషిన్ అవసరం ఉంటుంది...

Business Idea: ఈ వ్యాపారంతో నెలకు రూ. లక్ష పక్కా.. ఎలా ప్లాన్‌ చేయాలంటే..
Business Idea
Follow us on

ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. కల్తీ పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకోవడానికి ఆసక్తిచూపిస్తున్నారు. దీనిని వ్యాపార అస్త్రంగా మార్చుకుంటే మంచి లాభాలు పొందొచ్చు. ఇలాంటి వాటిలో ఒకటి గానుగ నూనె బిజినెస్‌ ఒకటి. ప్రస్తుతం గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఈ బిజినెస్‌తో భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు.

చిన్న చిన్న మిషన్‌లతో ఇంటి వద్దే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి నెలకు రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. ఇంతకి ఈ బిజినెస్‌ను ఎలా ప్రారంభించాలి.? ఎంత ఖర్చవుతుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాపారానికి ప్రధానంగా ఆయిల్ ఎక్స్ పెల్లర్ మెషిన్ అవసరం ఉంటుంది.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు 10X10 సైజ్ ఉన్న గది సరిపోతుంది. ఇక మిషన్‌ ధర విషయానికొస్తే కెపాసిటీ బట్టి రూ. 15 వేల నుంచి ప్రారంభమై లక్ష వరకు ఉంటుంది. ఈ బిజినెస్‌ ప్రారంభించాలంటే.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా fssai లైసెన్స్ పొందడం తప్పనిసరి దీంతోపాటు రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి. మీరు తయారు చేసిన నూనెను ప్యాకెట్స్‌ లేదా సీసాల్లో ప్యాక్‌ చేసిన నేరుగా విక్రయించుకోవచ్చు.

ఈ మిషన్‌ సహాయంతో తయారు చేసిన నూనెను మార్కెట్‌లో లీటరుకు రూ. 50 చొప్పున లాభం పొందొచ్చు. ఈ లెక్కన ఉదాహరణకు మీరు మీరు రోజుకు 50 లీటర్ల నూనెను తయారు చేసిన సరాసరి రోజుకు రూ. 2500 చొప్పున లాభం పొందొచ్చు. ఈ లెక్కన నెలకు రూ. 60 వేలకి పైగా సంపాదన ఆర్జించవచ్చు. ఒకవేళ మరింత ఎక్కువ నూనెను ఉత్పత్తి చేయగలిగితే ఎక్కువ లాభం పొందొచ్చు. అంతేకాకుండా నూనె తీసిన తర్వాత లభించే పిప్పిని కూడా పశువులకు మేతగా ఉపయోగపడుతుంది. దీన్ని విక్రయించి కూడా లాభాలు పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..