
ఒకప్పుడు తొలుత ఉద్యోగం, ఆ తర్వాత వ్యాపారం అనే ఆలోచనతో ఉండేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది. యువత ఆలోచనలో సైతం మార్పు వస్తోంది. చదువు పూర్తికాగానే వ్యాపారం చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఇప్పటికీ చాలా మంది వ్యాపారం అనగానే నష్టాలు వస్తాయని, పెట్టుబడి ఎక్కువగా ఉంటుందనే ఆలోచనలో ఉంటారు. అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారాలు కూడా ఉన్నాయి. అలాంటి ఓ మంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం పేపర్ ప్లేట్స్ వినియోగం భారీగా పెరిగింది. పెళ్లిళ్లు మొదలు ప్రతీ ఫంక్షన్‌లో పేపర్ ప్లేట్స్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతో వీటి తయారీకి డిమాండ్ పెరిగింది. కేవలం ఈవెంట్స్‌లోనే కాకుండా స్ట్రీట్ సైడ్ ఫుడ్స్, టిఫిన్ సెంటర్స్‌లో కూడా యూజ్ అండ్ త్రో ప్లేట్స్‌ను ఉపయోగిస్తున్నారు. పేపర్ ప్లేట్స్ తయారీని బిజినెస్‌గా మార్చుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ పేపర్ ప్లేట్స్ బిజినెస్‌కి ఎంత పెట్టుబడి కావాలి.? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పేపర్ ప్లేట్స్ తయారీకి చిన్న గది అవసరపడుతుంది. ఈ మిషిన్ల ధర్ల రూ. 60 వేల నుంచి ప్రారంభమవుతుంది.సింగిల్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మెషిన్ ధర రూ.60వేలు ఉంటుంది. డబుల్ హైడ్రాలిక్ మెషిన్ ధర రూ.1.20 లక్షల వరకు ఉంటుంది. మిషిన్స్‌తో పాటు వీటి తయారీకి ముడి సరుకు అవసరపడుతుంది. ఇవన్నీ మిషిన్స్ అమ్మే వారి వద్దే లభిస్తాయి. వీటి తయారీ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ప్లేట్స్ తయారీకి సంబంధించి యూట్యూబ్‌లో వీడియోలను సైతం చూడొచ్చు.
మిషిన్ ద్వారా రోజుకు సుమారు 5 వేల నుంచి 8 వేల వరకు ప్లేట్లను తయారు చేయవచ్చు. ఒక్కో ప్లేట్‌పై కనీసం 20 పైసలు లాభం లభిస్తుంది. ఈ లెక్కన తక్కువలో తక్కువ రోజుకు 5 వేల పేపర్ ప్లేట్లను తయారు చేసినా రోజుకు రూ. వెయ్యి సంపాదించవచ్చు. నెలకు రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు సంపాదించుకోవచ్చు. ఇక తయారు చేసిన వాటిని మార్కెటింగ్ చేసుకోవాలి. దగ్గరల్లోని కిరాణం దుకాణాలు, సూపర్ మార్కెట్లలో విక్రయించుకోవచ్చు.
మరిన్ని బిజినిస్ వార్తల కోసం క్లిక్ చేయండి..