Business Idea: ఈ వ్యాపారంతో కళ్లు చెదిరే ఆదాయం.. కార్లకు డిమాండ్‌ ఉన్నన్ని రోజులు, తగ్గేదేలే

|

Sep 02, 2024 | 4:00 PM

ఇలాంటి ఓ బెస్ట్ బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం కార్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరూ తమకంటూ ఓ సొంత కారు ఉండాలని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా పరిస్థితుల తర్వాత కార్లను కొనుగొలు చేసే వారి పెరిగింది. దీంతో కార్లకు అనుబంధ వ్యాపారాలకు సైతం డిమాండ్‌ పెరుగుతోంది...

Business Idea: ఈ వ్యాపారంతో కళ్లు చెదిరే ఆదాయం.. కార్లకు డిమాండ్‌ ఉన్నన్ని రోజులు, తగ్గేదేలే
Business Idea
Follow us on

ప్రస్తుతం వ్యాపారం చేయాలనుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఉద్యోగం చేసిన తర్వాత వ్యాపారం చేసే వారు, కానీ ప్రస్తుతం ఉద్యోగం చేస్తూనే వ్యాపారం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సరికొత్త వ్యాపారాలను ప్రారంభిస్తూ భారీగా లాభాలను ఆర్జిస్తున్నారు. అయితే మార్కెట్‌లో ప్రస్తుతం దేని అసవరం ఉందో గమనించి, ఆ వ్యాపారాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది.

ఇలాంటి ఓ బెస్ట్ బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం కార్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరూ తమకంటూ ఓ సొంత కారు ఉండాలని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా పరిస్థితుల తర్వాత కార్లను కొనుగొలు చేసే వారి పెరిగింది. దీంతో కార్లకు అనుబంధ వ్యాపారాలకు సైతం డిమాండ్‌ పెరుగుతోంది. ఇలాంటి ఓ వ్యాపారమే. కారు కార్బన్‌ క్లీనింగ్. ఇంతకీ కార్బన్‌ క్లీనింగ్ అంటే ఏంటి.? ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం మార్కెట్లో హైడ్రోటెక్‌ కార్బన్‌ క్లీనింగ్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. కారు వినియోగం పెరుగుతున్న కొద్దీ ఇంజన్‌ పనితీరు దెబ్బతింటుంది. పెట్రోల్‌, డీజీల్‌ కార్లలో మనం ఉపయోగించే ఇంధనంలో కేవలం 70 శాతం మాత్రమే ఇంజన్‌ ఉపయోగించుంకుంటుది. మిగతా 30 శాతం కార్బన్‌ రూపంలో ఇంజన్‌లోని భాగాల్లో పేరుకుపోతుంది. ఇదిగో ఈ కార్బన్‌ కారణంగానే ఇంజన్‌ పనితీరు దెబ్బతింటుంది. దీంతో వాహనం సౌండ్‌ రావడం, మైలేజ్‌ తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.

అయితే ఈ హైడ్రోటెక్‌ కార్బన్‌ క్లీనింగ్ మిషన్‌ ద్వారా కారు ఇంజన్‌లో పేరుకుపోయిన కార్బన్‌ను తొలగించవచ్చు. హైడ్రోటెక్‌ కంపెనీ తీసుకొచ్చిన ఈ మిషన్‌ ఇంజన్‌ డీ కార్బోనైషన్‌గా పిలుస్తుంటారు. ఈ మిషన్‌ సహాయంతో కేవలం 30 నిమిషాల్లోనే ఇంజన్‌లో పేరుకుపోయిన కార్బన్‌ను తొలగించుకోవచ్చు. లాభాల విషయానికొస్తే ఒక్క కారుకు సుమారు రూ. 2 నుంచి రూ. 4 వేలు లాభం పొందొచ్చు. దీని ఆపరేటింగ్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఈ బిజినెస్‌కు మంచి డిమాండ్ ఉంది. ధర విషయానికొస్తే ఈ మిషన్‌ బేసిక్‌ వేరియంట్‌ ధర రూ. 2.5 లక్షలుగా ఉంది. టాప్‌ వేరియంట్ ధర రూ. 3 లక్షలుగా ఉంది. తక్కువలో తక్కు రోజుకు రెండు కార్లు చేసుకున్నా కనీసం రూ. 5 నుంచి రూ. 6 వేల వరకు లాభం పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..