ఎంట్రీ లెవల్ 100 cc బైక్‌ల నుండి సూపర్‌బైక్‌ల వరకు, మార్కెట్లో వినియోగదారుల కోసం అనేక రకాల బైక్‌లు ఉన్నాయి. అయితే 125సీసీ సెగ్మెంట్ మోటార్‌సైకిళ్లకు కస్టమర్లలో అత్యధిక డిమాండ్ ఉంది. ఇవాళ మనం 125 cc ఇంజిన్ ఆప్షన్‌తో వస్తున్న కొన్ని స్పోర్టీ లుక్ బైక్‌ల గురించి తెలుసుకుందాం..
టీవీఎస్ రైడర్ బైక్ ధర రూ. 93,719(ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ 124.8 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్, ఆయిల్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ ఉంది. ఇది 11.2బిహెచ్‌పి పవర్, 11.2ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
భారతీయ మార్కెట్లో బజాజ్ పల్సర్ బైక్ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ బైక్ 125 cc ఇంజన్ ఆప్షన్‌తో కూడా అందుబాటులో ఉంది. పల్సర్ 125, పల్సర్ NS 125 బైక్‌లలో ఒకే విధమైన మెకానికల్ స్పెసిఫికేషన్ ఉపయోగించడం జరిగింది. ఈ రెండు బైక్‌లు 124.4 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. ఇది 11.8bhp శక్తిని, 11Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ బైక్‌ను వస్తుంది. ఈ బైక్ ధర రూ. 89,254(ఎక్స్ షోరూమ్).
హోండా బైక్ చాలా సరసమైన ధరలో లభిస్తుంది. ఈ బైక్ ధర రూ. 85,131(ఎక్స్‌షోరూమ్ ప్రైజ్) నుండి మొదలవుతుంది. ఈ బైక్‌లో, కంపెనీ 123.94 సిసి ఇంజన్‌ను అందించింది. ఇది 10.7బిహెచ్‌పి పవర్‌తో 10.9ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పైన పేర్కొన్న మోడళ్ల మాదిరిగానే 5 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..