Google Offer: ‘బ్రో నక్కని తొక్కావ్‌..’ సాధారణ డిగ్రీతో గూగుల్‌లో రూ. 1.64 కోట్ల ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్‌ కొట్టేసిన టెకీ

|

Oct 07, 2024 | 10:27 AM

బెంగళూరులో టైర్ 3 కాలేజీకి చెందిన ఓ యువకుడు గూగుల్‌లో భారీ ప్యాకేజీతో ఆఫర్‌ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏడాదికి రూ.65 లక్షల వేతనంతో కొలువు దక్కించుకోవడంతో నెట్టింట చర్చకు దారి తీసింది. ఎందుకంటే.. ప్రతిష్టాత్మక సంస్థల నుంచి వచ్చే గ్రాడ్యుయేట్లు మాత్రమేకాకుండా ఏ మాత్రం గుర్తింపులోని సాదాసీదా కాలేజీలో..

Google Offer: బ్రో నక్కని తొక్కావ్‌.. సాధారణ డిగ్రీతో గూగుల్‌లో రూ. 1.64 కోట్ల ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్‌ కొట్టేసిన టెకీ
Google Offer To Bengaluru Techie
Follow us on

బెంగళూరులో టైర్ 3 కాలేజీకి చెందిన ఓ యువకుడు గూగుల్‌లో భారీ ప్యాకేజీతో ఆఫర్‌ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏడాదికి రూ.65 లక్షల వేతనంతో కొలువు దక్కించుకోవడంతో నెట్టింట చర్చకు దారి తీసింది. ఎందుకంటే.. ప్రతిష్టాత్మక సంస్థల నుంచి వచ్చే గ్రాడ్యుయేట్లు మాత్రమేకాకుండా ఏ మాత్రం గుర్తింపులోని సాదాసీదా కాలేజీలో చదివిన యువకుడికి ఇలాంటి అవకాశం దొరకడం ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తుంది. JP మోర్గాన్‌లో డెవలపర్ అయిన కార్తీక్ జోలపారా పదేళ్ల వర్క్‌ ఎక్స్‌ పీరియన్స్‌తో గూగుల్‌లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎంపికయ్యాడు. తన జాబ్‌ ఆఫర్కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను తన ఎక్స్ ఖాతాలో షేర్‌ చేశాడు. దీంతో అదికాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

ఇతని ఆఫర్‌ లెటర్‌ చూసిన వారంతా ఒకింత షాక్‌కు గురవుతున్నారు. ఎందుకంటే.. కార్తీక్‌కు కనీనసం కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కూడా లేదు. టైర్ 3 కళాశాల నుంచి సాదాసీదా గ్రాడ్యుయేట్ అయిన అభ్యర్థి, అత్యంత ఆకర్షణీయమైన వార్షిక ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్ రావడం వింతగా తోస్తుంది. దీంతో టెక్ పరిశ్రమ జీతాలు, నియామక పద్ధతుల గురించి నెట్టింట చర్చకు దారితీసింది. అంతేకాదు కార్తిక్‌ ఆఫర్‌ లెటర్‌లో ఏడాదికి రూ. 65 లక్షల జీతంతోపాటు, రూ. 9 లక్షల వార్షిక బోనస్, రూ. 19 లక్షల సిగ్నేచర్ బోనస్, రూ. 5 లక్షల రీలొకేషన్ బోనస్ కూడా ఉన్నాయి. మొత్తంగా ఏడాదికి రూ. 1.64 కోట్లు అందుకోనున్నాడు. కార్తిక్‌ జోలపారా తన పోస్ట్‌కి ‘క్రేజీ ఆఫర్స్’ అనే క్యాప్షన్ తో పోస్టు చేశాడు. ఇక దీనిని చూసిన నెటిజన్లు భారతీయ జాబ్ మార్కెట్‌లో మారుతున్న డైనమిక్స్ గురించి చర్చలకు దారితీసింది.

ఇవి కూడా చదవండి

CS నేపథ్యం లేని టైర్ 3 కాలేజీ గ్రాడ్యుయేట్ ఇంత భారీ ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్‌ అందుకోవడం నిజంగా చాలా గ్రేట్‌, ‘ఆరు నుంచి ఎనిమిదేళ్ల అనుభవం ఉన్నవారికి ఇలాంటి ఆఫర్లు వస్తున్నాయి’, ‘గూగుల్ ఇలాంటి క్రేజ్‌ ఆఫర్స్‌ ఇస్తుంటే నేను కూడా నా CVకి పాలిష్ చేస్తాను’.. అంటూ నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో కామెంట్‌ సెక్షన్‌లో తమ ప్రతి స్పందనలు తెలుపుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.