Job Interview: ఉద్యోగం కావాలంటే 14 రౌండ్లు క్లియర్ చేయాల్సిందే.. వైరల్ అయిన మహిళా ఉద్యోగి పోస్ట్

ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికీ ఓ ఎమోషన్. కష్టపడి చదివి మంచి జీతంతో కూడిన ఉద్యోగం సంపాదించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కలల ఉద్యోగం పొందాలంటే 14 రౌండ్లు ఇంటర్వ్యూలో క్లియర్ చేశానని ఓ మహిళా ఉద్యోగి ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు మాత్రం అన్ని రౌండ్ల ఇంటర్వ్యూ ఏ కంపెనీ చేయదని వాదిస్తున్నారు.

Job Interview: ఉద్యోగం కావాలంటే 14 రౌండ్లు క్లియర్ చేయాల్సిందే.. వైరల్ అయిన మహిళా ఉద్యోగి పోస్ట్
Job Interview

Updated on: Jun 15, 2025 | 7:30 PM

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం అనేది ఓ పరుగు పందెంలా ఉంటుంది. ఎందుకంటే కంపెనీలు ఇంటర్వ్యూ రౌండ్ల పేరుతో అనేక అడ్డంకులను సృష్టిస్తాయి. రిక్రూటర్లు తరచుగా ఇంటర్వ్యూలను నిర్వహించడానికి వారి సొంత మార్గాన్ని కనుగొంటారు; లెక్కలేనన్ని ప్రశ్నలతో ఇంటర్వ్యూకు వచ్చిన వారిని విసిగిస్తూ ఉంటారు. ఒక మహిళ తన “కలల” ఉద్యోగాన్ని పొందే ముందు 14 రౌండ్ల ఇంటర్వ్యూలను క్లియర్ చేసినట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన తర్వాత ఇంటర్నెట్‌లో ఓ కొత్త చర్చ మొదలైంది.  అయితే ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో సదరు ఉద్యోగి ఈ పోస్ట్‌ను డిలీట్ చేసింది.  ఆ మహిళ విప్రో క్యాంపస్‌లో తన కొత్త కంపెనీలో గర్వంగా పోజులిచ్చిన ఫోటోలను షేర్ చేసింది. కంపెనీ భవనం, దాని ప్రాంగణంలో సెల్ఫీలతో పాటు తన కొత్త ఉద్యోగానికి రుజువుగా అందిస్తూ తన ఆఫీస్ ఐడి కార్డ్ చిత్రాన్ని కూడా షేర్ చేసింది. 

ఒక ఫోటోలో ఆమె పెద్ద విప్రో లోగో ముందు నిలబడింది. ఇంటర్వ్యూలో 14 రౌండ్లు క్లియర్ చేసిన తర్వాత చివరకు నేను ‘విప్రో’లో ‘డెవలపర్’ పాత్రకు ఎంపికయ్యాను. ఇప్పుడు నేను నా సొంత కాళ్లపై నిలబడతాను. కలలు అంటే మీరు నిద్రలో చూసేవి కావు. కలలు అంటే మిమ్మల్ని నిద్రపోనివ్వవు అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే 14 రౌండ్ల ఇంటర్వ్యూల గురించిన ప్రత్యేక అంశం ట్రోలింగ్‌కు కారణమైంది. చాలామంది ఆమె వాదనలను కూడా వ్యతిరేకించారు.

మాజీ విప్రో ఉద్యోగి ఒకరు గరిష్టంగా విప్రో ఉద్యోగానికి 4 నుంచి 5 రౌండ్ల ఇంటర్వ్యూలు ఉంటాయని స్పష్టం చేయగా.. విప్రో హెచ్ఆర్‌గా పని చేసిన మరొకరు “విప్రోలో 14 రౌండ్లు? హెచ్‌ఆర్ డిస్కషన్ రౌండ్‌తో సహా గరిష్టంగా నాలుగు రౌండ్లు ఉన్నాయి” పేర్కొన్నారు. మరికొందరు కూడా గరిష్టంగా 4–5 రౌండ్ల ఇంటర్వ్యూలు ఉంటాయని చెప్పారు. డెవలపర్ ఉద్యోగం కోసం ఏకంగా 14 రౌండ్ల ఇంటర్వ్యూలా అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే విప్రో డెవలపర్ తన వాదనలపై ఉన్న గందరగోళాన్ని ఇంకా స్పష్టంగా చెప్పలేదు. అయితే సదరు ఉద్యోగి గతంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో ఉద్యోగం చేసి బెంగళూరులో స్థిరపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి