ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు బీమా పథకాలు పాలసీదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. జీవిత, వాహనం లేదా గృహ బీమా అయినా ఈ పథకాలు ఏదైనా దురదృష్టకర పరిస్థితుల్లో బీమాదారుల కుటుంబానని ఆర్థికంగా రక్షించుకోవడానికి సహాయపడతాయి. అయితే బీమాను ఎంచుకునే సమయంలో ఎదుర్కొనే ఒక సమస్య టర్మ్ ఇన్సూరెన్స్ లేదా జీవిత బీమా కోసం వెళ్లాలా? వద్దా? అనే గందరగోళం. ఈ రెండు బీమా పాలసీల ప్రయోజనాలు ఒకేలా ఉన్నా రెండు ప్లాన్‌ల మధ్య చాలా తేడాలు ఉన్నాయి. టర్మ్, లైఫ్ ఇన్సూరెన్స్ ఒకదానికొకటి ఎలా భిన్నంగా ఉంటాయి. అయితే ఆర్థిక అవసరాలకు అనుగుణంగా బీమాను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఏ ఏ పాలసీ మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందో ఓ సారి తెలుసుకుందాం.
ఈ బీమా పాలసీదారు జీవిత కాలం వరకు చెల్లుబాటు అవుతుంది. కాబట్టి వారు జీవితాంతం ప్రీమియంలు చెల్లిస్తూనే ఉండాలి. ఇది పాలసీదారు, వారి కుటుంబం/నామినీలకు పొడిగించిన కవరేజీని అందిస్తుంది. పాలసీలో నగదు విలువ సంవత్సరాలుగా పెరిగే కొద్దీ మారుతూ ఉంటుంది. ముఖ్యంగా పాలసీదారుడు జీవించి ఉన్నప్పుడు నగదు విలువపై రుణం తీసుకోవచ్చు. అయితే ఈ బీమా పాలసీలో ప్రీమియంలు అధికంగా ఉంటాయని మాత్రం గమనించాలి.
టర్మ్ ఇన్సూరెన్స్ పరిమిత సంవత్సరాల పాటు నామినీ/కుటుంబానికి కవరేజీని అందిస్తుంది. అయితే ఈ పాలసీ పాలసీదారుడు జీవించి ఉంటే ఎలాంటి ప్రయోజనాలు అందించవు. కానీ ప్రీమియంలు మాత్రం చాలా చౌకగా ఉంటాయి.
పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది. జీవిత బీమా బీమా చేసిన వ్యక్తికి డెత్ బెనిఫిట్, మెచ్యూరిటీ బెనిఫిట్ రెండింటినీ అందిస్తుంది.
టర్మ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా రెండూ చెల్లించే ప్రీమియంలు చాలా తేడా ఉండవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. జీవిత బీమా ప్రీమియంలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి.
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ సరెండర్ చేయడం సులభం. ప్రీమియంలు చెల్లించడం మానేస్తే పాలసీ ప్రయోజనాలు ముగిసిపోతాయి. జీవిత బీమా విషయంలో జీవిత బీమా ఉన్న వ్యక్తి అన్ని ప్రీమియం చెల్లింపులను పూర్తి చేస్తేనే మెచ్యూరిటీ ప్రయోజనం ఇస్తారు. పాలసీదారు బీమాను సరెండర్ చేస్తే వర్తించే తగ్గింపుల తర్వాత మాత్రమే వారు చెల్లించిన ప్రీమియంలను తిరిగి పొందుతారు.
ఇది పాలసీదారుడి ఆర్థిక అవసరాలపై ఆధారపడి ఉంటుంది. తక్కువ వ్యవధికి అవసరమైన పాలసీని ఎంచుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అప్పుడు వారు ప్రీమియంలను ఆదా చేసుకోగలుగుతారు. ఒక వ్యక్తి వారికి నగదు విలువను అందించే కవరేజీ కోసం వెళ్లాలనుకుంటే మాత్రం జీవిత బీమా ఉత్తమ ఎంపికని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం