Car Loan: కారు కొనాలని అనుకుంటున్నారా.. తక్కువ వడ్డీకి లోన్ ఇస్తున్న బ్యాంకుల వివరాలివే..

|

May 01, 2022 | 9:36 PM

Car Loan: ప్ర‌స్తుత కాలంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల్లో కూడా ఇద్ద‌రు కంటే ఎక్కువ మంది ప్ర‌యాణించ‌డానికి కారు అనువైన వాహ‌నంగా ఉప‌యోగిస్తున్నారు. కారు కొనుగోలు చేయ‌డానికి చేతిలో త‌గినంత సొమ్ము లేకపోయినా రుణాలు అందిస్తున్న బ్యాంకుల వివరాలివే..

Car Loan: కారు కొనాలని అనుకుంటున్నారా.. తక్కువ వడ్డీకి లోన్ ఇస్తున్న బ్యాంకుల వివరాలివే..
Car Loan
Follow us on

Car Loan: ప్ర‌స్తుత కాలంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల్లో కూడా ఇద్ద‌రు కంటే ఎక్కువ మంది ప్ర‌యాణించ‌డానికి కారు అనువైన వాహ‌నంగా ఉప‌యోగిస్తున్నారు. కారు కొనుగోలు చేయ‌డానికి చేతిలో త‌గినంత సొమ్ము లేకపోయినా.. బ్యాంకులు మాత్రం సరసమైన రేట్లకే వెహికల్ లోన్స్(Vehicle Loans) అందిస్తున్నాయి. ఇప్పుడు బ్యాంకులు కూడా రుణాలను విరివిగా అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఎంచుకున్న వినియోగ‌దారుల‌కు ‘ప్రీ-అప్రూవ్డ్’ కార్ లోన్స్ లేదా వారి ప్ర‌స్తుత హౌస్ లోన్(House Loan) గ్ర‌హీత‌ల‌కు ప్రత్యేక రేట్ల‌ను అందిస్తున్నాయి. సరసమైన వడ్డీ రేటుకు లోన్ పొంద‌డానికి మీరు వేర్వేరు బ్యాంకులు అందించే కారు రుణ ఆఫ‌ర్ల‌ను పోల్చి చూసుకోవాలి.

కారు రుణాల‌పై వ‌ర్తించే వ‌డ్డీ రేట్లు మీ క్రెడిట్ స్కోర్‌, మీ వ్య‌క్తిగ‌త ఆదాయాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే నిర్ణ‌యించ‌బ‌డ‌తాయి. చాలా బ్యాంకులు త‌మ వడ్డీ రేట్ల‌ను క్రెడిట్ స్కోర్‌ల‌తో అనుసంధానించాయి. కాబ‌ట్టి..  750 లేదా అంత‌కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారు త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కు లోన్స్ పొందగలుగుతారు. త‌క్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న‌వారు వెహికల్ లోన్స్ పొంద‌లేక‌పోవ‌చ్చు లేదా ఎక్కువ వడ్డీ రేటుకు లోన్ పొందవచ్చు. అందుచేత కార్ లోన్ తీసుకునే ముందే మీ క్రెడిట్ స్టోర్ రిపోర్ట్ పరిశీలించుకోవటం మంచిది. లోన్ తో మీ బ‌డ్జెట్ కి అనుగుణ‌ంగా కారుని ఇంటికి తీసుకెళ్లవచ్చు. కారు విలువ త‌గ్గే ఆస్తి కాబ‌ట్టి, వ‌డ్డీ చెల్లింపును త‌గ్గించుకోవ‌డానికి త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిలో లోన్ చెల్లించటం మంచిది. ప్ర‌స్తుతం దేశంలో అతి త‌క్కువ కారు రుణ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్న ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగ బ్యాంకుల వివరాలను ఇప్పుడు తెలుసుకోండి. ఇందులో 3, 5 సంవ‌త్స‌రాల కాల వ్య‌వ‌ధికి రూ. 7.50 ల‌క్ష‌ల కార్ లోన్ తీసుకుంటే చెల్లించాల్సిన ఈఎమ్ఐ వివరాలు ఉన్నాయి.

వివిధ బ్యాంకులు అందిస్తున్న రుణాల వడ్డీ రేట్ల వివరాలు..

ఇవీ చదవండి..

Dining Out: సరదాగా బయట తినాలంటే బిల్లు’ వర్రీనా? ఇలా చేస్తే ‘నో టెన్షన్

Jobs: ఉద్యోగాల వేట మానేసిన లక్షల మంది భారతీయులు.. కారణాలు అవేనట..