Bank Loan: ఇప్పుడు బ్యాంకులు రుణంపై అదనపు ఛార్జీలను దాచలేరు.. ఆర్బీఐ కొత్త నిబంధనలు

|

Apr 16, 2024 | 2:26 PM

మీకు ఏదైనా లోన్ ఉంటే లేదా మీరు ఏదైనా పని కోసం లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు బ్యాంకులు ఖాతాదారుల నుండి రుణాలపై వివిధ ఛార్జీలు, రుసుముల గురించి సమాచారాన్ని దాచలేరు. వారు ఈ ఫీజులు, ఛార్జీల గురించి కస్టమర్లకు తెలియజేయాలి. అక్టోబరు 1 నుండి రిటైల్..

Bank Loan: ఇప్పుడు బ్యాంకులు రుణంపై అదనపు ఛార్జీలను దాచలేరు.. ఆర్బీఐ కొత్త నిబంధనలు
Bank Loan
Follow us on

మీకు ఏదైనా లోన్ ఉంటే లేదా మీరు ఏదైనా పని కోసం లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు బ్యాంకులు ఖాతాదారుల నుండి రుణాలపై వివిధ ఛార్జీలు, రుసుముల గురించి సమాచారాన్ని దాచలేరు. వారు ఈ ఫీజులు, ఛార్జీల గురించి కస్టమర్లకు తెలియజేయాలి. అక్టోబరు 1 నుండి రిటైల్, ఎంఎస్‌ఎంఈ లోన్‌లు తీసుకునే కస్టమర్‌లకు వడ్డీ, ఇతర ఖర్చులతో సహా రుణానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అందించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ కోరుతుంది. దీని కోసం ఆర్బీఐ కేఎఫ్‌ఎస్‌ అంటే ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్ రూల్‌ని రూపొందించింది. కేఎఫ్‌ఎస్‌ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం.

ఎందుకు నిర్ణయం తీసుకున్నారు?

రుణాల కోసం కెఎఫ్‌ఎస్‌పై సూచనలను సమన్వయం చేయాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ ప్రకారం, పారదర్శకతను పెంచడానికి, ఆర్‌బిఐ పరిధిలోకి వచ్చే ఆర్థిక సంస్థల ఉత్పత్తులకు సంబంధించిన సమాచార లోపాన్ని తొలగించడానికి ఇది జరిగింది. దీనితో రుణగ్రహీత ఆర్థిక నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోగలుగుతారు. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలు (REలు) ఇచ్చే రిటైల్, ఎంఎస్‌ఎంఈ టర్మ్ లోన్‌ల విషయంలో ఈ సూచన వర్తిస్తుంది.

కేఎఫ్‌ఎస్‌ అంటే ఏమిటి? ఇది ఎప్పుడు అమలు చేస్తారు?

కేఎఫ్‌ఎస్‌ అనేది సాధారణ భాషలో రుణ ఒప్పందం కీలక వాస్తవాల ప్రకటన. ఇది ప్రామాణికంగా రుణగ్రహీతలకు అందిస్తారు. సెంట్రల్ బ్యాంక్ ప్రకారం, ఆర్థిక సంస్థలు వీలైనంత త్వరగా మార్గదర్శకాలను అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాయి. అక్టోబర్ 1, 2024న లేదా ఆ తర్వాత మంజూరు చేసిన అన్ని కొత్త రిటైల్, ఎంఎస్‌ఎంఈ టర్మ్ లోన్‌ల విషయంలో మార్గదర్శకాలు అనురిస్తారు. ఇప్పటికే ఉన్న కస్టమర్లకు ఇచ్చిన కొత్త రుణాలు కూడా ఇందులో ఉన్నాయి.

థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్

ఆర్బీఐ ప్రకారం, రుణం తీసుకునే సంస్థల నుండి థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ల తరపున సెంట్రల్ బ్యాంక్ పరిధిలోకి వచ్చే సంస్థలు సేకరించే బీమా, లీగల్ ఫీజులు వంటి మొత్తాలు కూడా వార్షిక శాతం రేటు (APR)లో భాగంగా ఉంటాయి. ఈ విషయాన్ని ప్రత్యేకంగా వెల్లడించాలి. అటువంటి ఛార్జీల రికవరీలో ఆర్‌ఈ పాల్గొన్న చోట, ప్రతి చెల్లింపు కోసం రుణగ్రహీతలకు సహేతుకమైన సమయంలో రసీదులు, సంబంధిత పత్రాలు అందిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి