Loan: ఆధార్, పాన్ ఉంటే చాలు.. కేవలం నిమిషాల్లోనే రూ.5 లక్షల వరకు లోన్..

ఆధార్ కార్డు, పాన్ కార్డు కలిగి ఉన్నారా.. మీరు కేవలం నిమిషాల వ్యవధిలోనే రూ.5 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఎప్పుడు డబ్బులు అత్యవసరంగా ఉపయోగపడతాయో తెలియదు. దీంతో చాలా బ్యాంక్‌లు ఇన్‌స్టంట్ లోన్లను ఆఫర్ చేస్తున్నాయి.

Loan: ఆధార్, పాన్ ఉంటే చాలు.. కేవలం నిమిషాల్లోనే రూ.5 లక్షల వరకు లోన్..
Aadhar And Pan

Updated on: Feb 10, 2026 | 9:00 PM

ఒకప్పుడు లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ రోజలు తరబడి తిరగాల్సి వచ్చేది. డాక్యుమెంట్స్ అన్నీ సమర్పించాక అధికారులు పరిశీలించి లోన్ మంజూరు చేయడానికి చాలా రోజుల సమయం పట్టేది. దాదాపు 10 రోజుల వరకు సమయం పట్టేంది. కానీ ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పింది. కేవలం మీ మొబైల్ ద్వారానే నిమిషాల్లోనే ఏ లోన్‌కైనా దరఖాస్తు చేసుకునే సుదుపాయం అందుబాటులోకి వచ్చింది. బ్యాంకింగ్ యాప్స్‌తో పాటు ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థలు ఈ మేరకు మొబైల్ యాప్‌లను ప్రవేశపెట్టాయి. ఈ యాప్‌ల ద్వారా ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్లను మంజూరు చేస్తున్నాయి. కేవలం ఆధార్, పాన్ కార్డు వివరాలు ఇస్తే నిమిషాల వ్యవధిలోనే డబ్బులు మీ అకౌంట్లో జమ అవుతాయి. మీరు ఇక ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అందించాల్సిన అవసరం ఉండదు.

పాన్ కార్డు, ఆధార్ ఇస్తే చాలు

బ్యాంకులు, లోన్ యాప్స్, ఎన్ఎఫ్‌బీసీ సంస్థలు ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్లు మంజూరు చేస్తున్నాయి. వీటిని పొందాలంటే ఎలాంటి డాక్యుమెంట్ల అవసరం లేదు. కేవలం మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు ఉంటే చాలు. వీటి వివరాలు నమోదు చేయడం ద్వారా మీరు నిమిషాల్లోనే పర్సనల్ లోన్ పొందవచ్చు. పర్సనల్ లోన్ అనేది అన్‌సెక్యూర్డ్ లోన్‌గా భావిస్తారు. ఇది పొందేందుకు ఎలాంటి డాక్యుమెంట్, ఆస్తి తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. పాన్ కార్డు ద్వారా మీ సిబిల్ స్కోర్‌ను చెక్ చేస్తారు. అలాగే ఆధార్ కార్డు ద్వారా మీ ఈకేవైసీ వివరాలు పూర్తి చేస్తారు. వెంటనే మీకు ఎంత లోన్ వస్తుందనేది నిర్ణయించి మంజూరు చేస్తారు.

కావాల్సిన డాక్యుమెంట్స్

-ఫిజికల్‌గా ఆధార్, పాన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు
-కేవలం డిజిటల్ రూపంలో ఆధార్, పాన్ అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది
-క్రెడిట్ స్కోర్ 700 కంటే ఎక్కువ ఉంటే తక్కువ వడ్డీకే లోన్ అందుతుంది
-సిబిల్ స్కోర్ 700 కంటే తక్కువగా ఉంటే వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది
-నెలవారీ ఆదాయం పొందేవారు, చిరు వ్యాపారులు ఈ లోన్లు తీసుకోవచ్చు

వడ్డీ రేట్లు ఎంత ఉంటాయంటే..?

ఈ పర్సనల్ లోన్ల వడ్డీ 10.5 శాతం నుంచి 24 శాతం వరకు ఉంటుంది. రూ.5 లక్షల వరు మీరు ఈ విధానం ద్వారా మీరు ఇన్‌స్టంట్ లోన్ పొందవచ్చు. ఇక కొన్ని బ్యాంకింగ్ సంస్థలు శాలరీ పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ అందించాల్సిందిగా కోరుతున్నాయి. వీటిని అందిస్తే మీ క్రెడిట్ లిమిట్‌ను నిర్ధారించి రుణం మంజూరు చేస్తాయి.