Cheque Bounce: బ్యాంకులకు సెలవులున్నాయని కాదా అని లైట్‌ తీసుకోకండి.. చెక్‌ రాసిస్తే డబ్బులు ఉండాల్సిందే. ఎందుకంటే..

Cheque Bounce: సాధారణంగా ఆర్థిక లావాదేవీల కోసం చెక్‌ రాసి ఇస్తుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో ఖాతాలో సరిపడ డబ్బులు లేకపోయినా సమయానికి వేద్దాంలే అనుకొని చెక్‌పై..

Cheque Bounce: బ్యాంకులకు సెలవులున్నాయని కాదా అని లైట్‌ తీసుకోకండి.. చెక్‌ రాసిస్తే డబ్బులు ఉండాల్సిందే. ఎందుకంటే..

Edited By:

Updated on: Sep 20, 2021 | 8:45 AM

Cheque Bounce: సాధారణంగా ఆర్థిక లావాదేవీల కోసం చెక్‌ రాసి ఇస్తుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో ఖాతాలో సరిపడ డబ్బులు లేకపోయినా సమయానికి వేద్దాంలే అనుకొని చెక్‌పై సంతకం చేసి వేరే వారికి ఇచ్చేస్తాం. ముఖ్యంగా ఆదివారం, బ్యాంకులకు సెలవులు ఉన్న సమయాల్లో ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటాం. అయితే అలా అని ఖాతాలో డబ్బులు లేకపోయినా చెక్‌ రాసి ఇస్తే జరిమాన ఎదురుక్కోవాల్సి వస్తుందని ఖాతాదారులను బ్యాంకులు అలర్ట్‌ చేశాయి. చెక్‌బౌన్స్‌ అయితే కొన్ని సందర్భాల్లో కేసులు కూడా నమోదవుతాయనే విషయం తెలిసిందే.

అయితే గతంలో చెక్‌లను బ్యాంకులో వేస్తే క్లియర్‌ కావడానికి కొంత సమయం పట్టేది. దీనికి కారణం వారాంతపు సెలవులు, ఇతర సెలవులు ఉండడమే. అయితే ఇప్పుడు చెక్‌ క్లియర్‌ కావడానికి ఎక్కువ సమయం పట్టట్లేదు. అన్ని రకాల సెలవు దినాల్లోనూ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (నాచ్‌) సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సెలవు దినాల్లోనూ చెక్‌లు క్లియర్‌ అవుతున్నాయి. కాబట్టి ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే నాచ్‌ వ్యవస్థను.. భారీ మొత్తంలో నగదు చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలో రూపొందించారు. కరోనా సమయంలో వివిధ ప్రభుత్వ పథకాల కింద నగదు బదిలీకి నాచ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంది. నాచ్ సేవలు ప్రతిరోజూ అందుబాటులో ఉండటంతో సెలవు దినాల్లో వాటర్‌, ఎలక్ట్రిసిటీ, గ్యాస్‌, ఫోన్‌, రుణ వాయిదాలు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్లు, బీమా ప్రీమియం చెల్లింపులు గడువు లోపే పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. చూశారుగా ఎలాగో బ్యాంకులకు సెలవులు ఉన్నాయిగా సరిపడ డబ్బులు లేకపోతే ఏమవుతుందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్నమాట.

Also Read: Funny Video: గాఢ నిద్రలోంచి సడెన్‌గా లేచిన చిన్నోడు.. ఆ తరువాత వాడు చేసిన పనికి ఫిదా అయిపోతున్న నెటిజన్లు..

Bigg Boss 5 Telugu: అంబరాన్ని తాకిన యాంకర్‌ రవి పుట్టిన రోజు వేడుకలు.. హౌజ్‌ బయట రచ్చ చేసిన ఫ్యామిలీ మెంబర్స్‌..

Vidyullekha Raman: లేడి కమిడియన్ విద్యుల్లేఖ పెళ్లి ఫోటోలు.. సోషల్ మీడియాలో షేర్ చేసిన బుజిమా..