Banking Loan Rejected: రుణ దరఖాస్తు పదే పదే తిరస్కరణకు గురవుతుందా? ముఖ్య కారణం ఏంటో తెలుసా?

|

Nov 23, 2024 | 9:32 PM

Banking Loan Rejected: మీ లోన్ దరఖాస్తు ఒక చోట తిరస్కరించబడితే, మీరు మరొక చోట దరఖాస్తు చేయడానికి ముందు కొంత సమయం వేచి ఉండాలి. మీరు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ క్రెడిట్ రిపోర్ట్‌లో మీ వివరాలు నమోదు అవుతాయి. ఈ పరిస్థితిలో మీరు ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీలలో లోన్ కోసం

Banking Loan Rejected: రుణ దరఖాస్తు పదే పదే తిరస్కరణకు గురవుతుందా? ముఖ్య కారణం ఏంటో తెలుసా?
Follow us on

చాలా సార్లు మనకు అకస్మాత్తుగా డబ్బు అవసరం అవుతుంది. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ, వివాహం లేదా ఇల్లు లేదా కారు కొనడం వంటివి. కానీ, అన్ని పేపర్‌వర్క్‌లను పూర్తి చేసిన తర్వాత కూడా బ్యాంక్ మీ లోన్ దరఖాస్తును చాలా సార్లు తిరస్కరిస్తుంది. ఆర్బీఐ (RBI) కఠినమైన నిబంధనల కారణంగా బ్యాంకులు ఇప్పుడు రుణం ఇవ్వడానికి ముందు దరఖాస్తును నిశితంగా పరిశీలించవచ్చు. స్వల్ప వ్యత్యాసం ఉన్నాదరఖాస్తును తిరస్కరిస్తారు. మీరు ఎమర్జెన్సీ కోసం రుణం తీసుకుంటున్నట్లయితే, దరఖాస్తును తిరస్కరించినట్లయితే అనేక సమస్యలు ఉండవచ్చు. మీ పని ఆగిపోవచ్చు, మీరు ఎక్కడి నుండైనా ఖరీదైన వడ్డీ రేటుకు రుణం తీసుకోవలసి రావచ్చు. బ్యాంకు రుణ దరఖాస్తులు ఎందుకు తిరస్కరిస్తుంది? దీనిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో చూద్దాం.

ఏ కారణం చేత రుణ దరఖాస్తును తిరస్కరించవచ్చు?

బ్యాంకులు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCలు) రుణ దరఖాస్తులను తిరస్కరించేటప్పుడు కూడా కారణాలను తెలియజేస్తాయి. తక్కువ క్రెడిట్ స్కోర్ లేదా తక్కువ ఆదాయం వంటివి. ఒకే చోట ఉండకపోవడం, ఉద్యోగం చేయకపోవడం వంటి కారణాల వల్ల చాలాసార్లు దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. మీ క్రెడిట్ నివేదికలో ఏవైనా తప్పులు ఉంటే, దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం ఉంటుంది.

క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయడం చాలా ముఖ్యం:

రుణం ఇవ్వడానికి ఏదైనా ఆర్థిక సంస్థ ముందుగా మీ క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్‌ స్కోర్‌ని తనిఖీ చేస్తుంది. 750 క్రెడిట్ స్కోర్ ఉంటే ఉత్తమ స్కోర్‌గా పరిగణిస్తారు. మీ స్కోర్ దీని కంటే తక్కువగా ఉంటే, మీరు కొంత సమయం వరకు రుణం కోసం దరఖాస్తు చేయకూడదు. అంతేకాదు మీ స్కోర్‌ను పదేపదే చెక్‌ చేసుకోకూడదు. ఇలా చేసినా స్కోర్‌ తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మీరు మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోవడంపై పూర్తి శ్రద్ధ వహించాలి. బకాయి ఉన్న ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించాలి. కొంత సమయం తర్వాత మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. మీకు స్కోర్‌ లేనప్పుడు ఒకేసారి అనేక బ్యాంకుల్లో రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవడం మానుకోండి.

లోన్‌ కోసం ఎక్కువ బ్యాంకుల్లో దరఖాస్తు చేయకూడదు:

మీ లోన్ దరఖాస్తు ఒక చోట తిరస్కరించబడితే, మీరు మరొక చోట దరఖాస్తు చేయడానికి ముందు కొంత సమయం వేచి ఉండాలి. మీరు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ క్రెడిట్ రిపోర్ట్‌లో మీ వివరాలు నమోదు అవుతాయి. ఈ పరిస్థితిలో మీరు ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీలలో లోన్ కోసం దరఖాస్తు చేయకుండా ఉండాలి.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి