ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..

దేశంలోనే పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అనగానే ఎస్బీఐ టక్కున గుర్తుకొస్తుంది. కానీ ఎస్బీఐని పక్కకు నెట్టి మరో బ్యాంక్ ఉత్తమ బ్యాంక్ అవార్డు పొందింది. బ్యాంకింగ్ రంగానికి ఆస్కార్‌గా పరిగణించే ఈ అవార్డును ఎస్బీఐ, ఐసీఐసీఐ వంటి దిగ్గజాలను దాటి బ్యాంక్ ఆఫ్ బరోడా సాధించింది. ఈ అవార్డు రావడానికి కారణాలు ఏంటీ..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
Bank Of Baroda

Updated on: Dec 14, 2025 | 11:58 AM

ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా బ్యాంకింగ్ రంగం వెన్నెముకగా ఉంటుంది. భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వంటి అనేక రకాల బ్యాంకులు ఉన్నప్పటికీ.. వీటిలో అత్యుత్తమ బ్యాంకుగా నిలిచిన సంస్థ ఏది? అంటే.. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకింగ్ దిగ్గజాలను దాటి మరో ప్రభుత్వ రంగ సంస్థ ఆ అరుదైన ఘనతను సాధించింది. ది బ్యాంకర్ మ్యాగజైన్ ప్రకటించిన ది బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 2025లో బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలోనే ఉత్తమ బ్యాంకుగా గుర్తింపు పొందింది. బ్యాంకింగ్ రంగానికి ఆస్కార్‌గా పరిగణించే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఆ బ్యాంక్ చూపిన అద్భుతమైన పనితీరు ఆధారంగా ఇస్తారు.

అవార్డుకు గల ముఖ్య కారణాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ అవార్డును దక్కించుకోవడానికి ప్రధానంగా మూడు అంశాలు దోహదపడ్డాయి.

అద్భుత ఆర్థిక వృద్ధి: కఠినమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా స్థిరమైన, బలమైన వృద్ధిని సాధించడం.

వినూత్న డిజిటల్ సేవలు: కస్టమర్లకు అత్యాధునిక డిజిటల్ ఉత్పత్తులను, సేవలను అందించడం.

కస్టమర్ సంతృప్తి: కస్టమర్ల అవసరాలను తీర్చడంలో, మెరుగైన సేవలను అందించడంలో అగ్రస్థానంలో నిలవడం.

బ్యాంక్ ఆఫ్ బరోడా చరిత్ర

ఈ బ్యాంక్‌ను 1908 జూలై 20న సర్ మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III స్థాపించారు. ఇది దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటిగా కొనసాగుతోంది. బ్యాంకు మొత్తం ఆస్తులలో 63.97వాటా భారత ప్రభుత్వం కలిగి ఉంది. ఈ బ్యాంక్‌కు దేశంలో, ప్రపంచవ్యాప్తంగా సుమారు 180 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా బలమైన ఉనికిని కలిగి ఉంది. ఇది 17 కంటే ఎక్కువ దేశాలలో తన సేవలను అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి