జూన్ నెల ముగిసింది. జూలై నెల ప్రారంభమైంది. ప్రతి నెల మొదటి నుంచి కొత్త కొత్త నిబంధనలు రావడం అనేది అందరికి తెలిసిందే. ముఖ్యంగా బ్యాంకు వినియోగదారులు గమనించాల్సిన విషయం ఏంటంటే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయనే విషయం. ఎందుకంటే చాలా మంది ప్రతి రోజు బ్యాంకు లావాదేవీలు, ఇతర పనులు చేసుకుంటారు. ఇలా బ్యాంకు హాలిడేన్‌ను ముందుగానే గమనించుకుంటే ఇబ్బందులు ఉండవు. లేకపోతే ఆర్థిక నష్టంతో పాటు సమయం వృధా అయ్యే అవకాశాలుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు మంత్లీ హాలిడేస్ లిస్ట్‌ను ప్రకటిస్తుంటుంది. అలాగే జూలై నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. అయితే వినియోగదారులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల బ్యాంకులకు వర్తించవన్న విషయం గుర్తించుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి