Bank Holidays
ప్రతి రోజు బ్యాంకింగ్ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లే వారికి అలర్ట్. ఎందుకుంటే బ్యాంకులు ఏయే రోజుల్లో మూసి ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. బ్యాంకుల సెలవులను తెలుసుకుంటే ముందస్తుగా బ్యాంకు పనుల కోసం ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే మీ సమయం వృద్ధా అవుతుంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. మరీ అక్టోబర్ నెలలో బ్యాంకులకు 21 రోజులు సెలవులు ఉండనున్నాయో తెలసుకుందాం.
అక్టోబర్ బ్యాంక్ సెలవుల జాబితా..
- అక్టోబర్ 1: బ్యాంకుల్లో ఖాతాలకు అర్ధ-వార్షిక ముగింపు సెలవు – గ్యాంగ్‌టక్
- అక్టోబర్ 2: ఆదివారం, గాంధీ జయంతి సెలవులు – దేశమంతటా
- అక్టోబర్ 3: దుర్గా పూజ (మహా అష్టమి) – హైదరాబాద్, అగర్తాల, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ
- అక్టోబర్ 4: దుర్గా పూజ / దసరా (మహానవమి) / ఆయుధ పూజ / శ్రీమంత్ శంకర్‌దేవ్ పుట్టినరోజు – అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపూర్
- అక్టోబర్ 5: దుర్గా పూజ / దసరా (విజయ దశమి) / శ్రీమంత్ శంకర్‌దేవ్ పుట్టినరోజు – దేశమంతటా
- అక్టోబర్ 6: దుర్గా పూజ (దాసాయి) – గ్యాంగ్‌టక్
- అక్టోబర్ 7: దుర్గా పూజ (దాసాయి) – గ్యాంగ్‌టక్
- అక్టోబర్ 8: రెండవ శనివారం, మిలాద్-ఎ-షరీఫ్/ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (ప్రవక్త ముహమ్మద్ జన్మదినం ) – దేశమంతటా
- అక్టోబర్ 9: ఆదివారం – దేశమంతటా
- అక్టోబర్ 13: కర్వా చౌత్ – సిమ్లా
- అక్టోబర్ 14: శుక్రవారం ఈద్-ఎ-మిలాద్-ఉల్-నబీ పుట్టినరోజు – జమ్మూ, శ్రీనగర్
- అక్టోబర్ 16: ఆదివారం – దేశమంతటా
- అక్టోబర్ 18: కటి బిహు – గౌహతి
- అక్టోబర్ 22: నాల్గవ శనివారం – దేశమంతటా
- అక్టోబర్ 23: ఆదివారం – దేశమంతటా
- అక్టోబర్ 24: కాళీ పూజ/దీపావళి/దీపావళి (లక్ష్మీ పూజ/నరక్ చతుర్దశి) , గ్యాంగ్‌టక్, హైదరాబాద్, ఇంఫాల్ మినహా అన్ని ప్రదేశాలు
- అక్టోబర్ 25: లక్ష్మీ పూజ/దీపావళి/గోవర్ధన పూజ – గ్యాంగ్టక్, హైదరాబాద్, ఇంఫాల్, జైపూర్
- అక్టోబర్ 26: గోవర్ధన్ పూజ/విక్రమ్ సంవంత్ నూతన సంవత్సరం రోజు/భాయ్ బిజ్/భాయ్ దూజ్/దీపావళి (బలి ప్రతిపద)/లక్ష్మీ పూజ/ప్రవేశ దినం – అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గాంగ్టక్, జమ్మూ, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్పూర్, సిమ్లా, శ్రీనగర్
- అక్టోబర్ 27: భాయ్ దూజ్ / చిత్రగుప్త జయంతి / లక్ష్మీ పూజ / దీపావళి / నింగోల్ చకౌబా – గాంగ్టక్, ఇంఫాల్, కాన్పూర్, లక్నో
- అక్టోబర్ 30 – ఆదివారం – దేశమంతటా
- అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు / సూర్య షష్ఠి దళ ఛత్ (ఉదయం) / ఛత్ పూజ – అహ్మదాబాద్, పాట్నా మరియు రాంచీ.
నోట్: ఈ బ్యాంకు సెలవులన్ని అన్ని రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. ఆయా రాష్ట్రాలను బట్టి సెలవులు నిర్ణయించడం జరుగుతుంది.)