Bank Holidays in July 2023: వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో 14 రోజుల పాటు బ్యాంకులు బంద్‌!

|

Jun 25, 2023 | 8:56 AM

మరో ఐదు రోజుల్లో జూన్‌ నెల ముగియబోతోంది. జూలై వచ్చేస్తోంది. అయితే కొత్త నెల రాగానే చాలా మంది బ్యాంకుల సెలవులపై దృష్టి పెడుతుంటారు. ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో గమనించి ముందస్తుగా ప్లాన్‌ చేసుకుంటారు వినియోగదారులు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రతినెల బ్యాంకులకు ఏయే..

Bank Holidays in July 2023: వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో 14 రోజుల పాటు బ్యాంకులు బంద్‌!
Bank Holidays in July 2023:
Follow us on

మరో ఐదు రోజుల్లో జూన్‌ నెల ముగియబోతోంది. జూలై వచ్చేస్తోంది. అయితే కొత్త నెల రాగానే చాలా మంది బ్యాంకుల సెలవులపై దృష్టి పెడుతుంటారు. ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో గమనించి ముందస్తుగా ప్లాన్‌ చేసుకుంటారు వినియోగదారులు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రతినెల బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉండనున్నాయో ఆ జాబితాను విడుదల చేస్తుంటుంది. అందుకే మీరు కూడా బ్యాంకు పనుల నిమిత్తం ప్రతి రోజు వెళితే ఈ బ్యాంకు సెలవుల జాబితాను గమనించి ముందస్తు ప్లాన్‌ చేసుకోవడం మేలు. ప్లాన్‌ చేసుకోకపోతే సమయం వృధాతో పాటు కొంత ఆర్థిక నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంది. జూలై నెలలో బ్యాంకులకు 14 రోజుల పాటు సెలవులు రానున్నాయి.

జూలై 2023 బ్యాంకు సెలవుల జాబితా:

  1. జూలై 2-ఆదివారం సెలవు
  2. జూలై 5 -గురు గోవింద్ జయంతి-జమ్ము, శ్రీనగర్‌లో సెలవు
  3. జూలై 6- మిజోరాంలో ఎంహెచ్ఐపీ సెలవు
  4. జూలై 8 -రెండవ శనివారం
  5. జూలై 9 -ఆదివారం
  6. జూలై 11- త్రిపురలో కేరా పూజా సందర్భంగా సెలవు
  7. జూలై 13- సిక్కింలో భాను జయంతి సెలవు
  8. జూలై 16 – ఆదివారం
  9. జూలై 17- మేఘాలయలో యూ తిరోట్ సింగ్ డే
  10. జూలై 22 -నాలుగవ శనివారం
  11. జూలై 23 -ఆదివారం
  12. జూలై 29 -మొహర్రం
  13. జూలై 30- ఆదివారం
  14. జూలై 31- హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో షహాదత్ సెలవు

గమనిక: ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గమనించండి. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి బ్యాంకులు మూసి ఉంటాయి.