Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు 21 రోజుల సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..

|

Oct 02, 2021 | 5:43 AM

Bank Holidays: మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? తరుచుగా బ్యాంక్‌కు వెళ్తుంటారా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్ సెలవులు..

Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు 21 రోజుల సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..
Follow us on

Bank Holidays: మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? తరుచుగా బ్యాంక్‌కు వెళ్తుంటారా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవడం మంచిది. ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మీరు ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఈ నెలలో బ్యాంకులకు 21 రోజులపాటు సెలవులు ఉన్నాయి. అయితే
అయితే రాష్ట్రం ప్రాతిపదికన సెలవులు మారతాయి.
21 రోజులలో 14 మాత్రమే ఆర్బీఐ జారీ చేసిన బ్యాంక్ సెలవులు. మిగిలినవి 7 రోజులు వారాంతపు సెలవులు, ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు ఉన్నాయి. ఇక సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుందాం.

అక్టోబర్ 1 – బ్యాంక్ ఖాతాల హాఫ్ వార్షిక ముగింపు (గాంగ్‌టాక్)
అక్టోబర్ 2 – మహాత్మా గాంధీ జయంతి (అన్ని రాష్ట్రాలు)
అక్టోబర్ 3 – ఆదివారం
అక్టోబర్ 6 – మహాలయ అమావాస్యే (అగర్తలా, బెంగళూరు, కోల్‌కతా)
అక్టోబర్ 7 – లైనింగ్‌థౌ సనామహి (ఇంఫాల్) యొక్క మేరా చౌరెన్ హౌబా
అక్టోబర్ 9 – 2 వ శనివారం
అక్టోబర్ 10 – ఆదివారం
అక్టోబర్ 12 – దుర్గా పూజ (మహా సప్తమి) / (అగర్తలా, కోల్‌కతా)
అక్టోబర్ 13 – దుర్గా పూజ (మహా అష్టమి) / (అగర్తలా, భువనేశ్వర్, గాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ)
అక్టోబర్ 14 – దుర్గా పూజ, దసరా (మహా నవమి), ఆయుధ పూజ (అగర్తలా, బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, శ్రీనగర్, తిరువనంతపురం)
అక్టోబర్ 15 – దుర్గా పూజ, దసరా (ఇంఫాల్ సిమ్లాలో మినహా అన్ని బ్యాంకులు)
అక్టోబర్ 16 – దుర్గా పూజ (దాసైన్) / (గ్యాంగ్‌టక్)
అక్టోబర్ 17 – ఆదివారం
అక్టోబర్ 18 – కాటి బిహు (గౌహతి)
అక్టోబర్ 19 -ఈద్ -ఎ-మిలాద్,
అహ్మదాబాద్, బెలపూర్, భోపాల్, చెన్నై, డెహ్రడూన్, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురం రీజియన్లలో సెలవు.
అక్టోబర్ 20 -మహర్షి వాల్మీకి పుట్టినరోజు, లక్ష్మీ పూజ, ఐడి-ఇ-మిలాద్ (అగర్తలా, బెంగళూరు, చండీగఢ్, కోల్‌కతా, సిమ్లా).
అక్టోబర్ 22- ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (జమ్మూ, శ్రీనగర్) తరువాత శుక్రవారం
అక్టోబర్ 23 – 4 వ శనివారం
అక్టోబర్ 24 – ఆదివారం
అక్టోబర్ 26 – వెల్ కమ్ డే (జమ్మూ, శ్రీనగర్)
అక్టోబర్ 31 – ఆదివారం.

కాగా, ఈ సెలవుల జాబితా చూస్తే అక్టోబర్‌లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు 10 సెలవులు వచ్చాయి. అందులో ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం సాధారణంగా ఉండే సెలవులే. అక్టోబర్‌లో 5 ఆదివారాలు వచ్చాయి. ఈ సెలవులతో పాటు గాంధీ జయంతి, దసరా, ఈద్ -ఎ-మిలాద్ సందర్భంగా బ్యాంకులకు మూడు సెలవులు వచ్చాయి. ఇవన్నీ కలిపి తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులు బ్యాంకులు మూసే ఉంటాయి. అందుకే ఖాతాదారులు ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలి.

ఇవీ కూడా చదవండి:

ATM: ఇక నుంచి ఏటీఎంలలో డబ్బుల కొరత ఉండదు.. ఆర్బీఐ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ 1 నుంచి అమలు..!

RBI New Rules: బ్యాంకు కస్టమర్లు అలర్ట్‌.. నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు.. ఏయే అంశాలలో అంటే..