Bank Holidays: నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్.. కస్టమర్లకు బిగ్ అలర్ట్..

వచ్చే వారంలో నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో బ్యాంక్ ఖాతాదారులు దీని గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. రక్షాబంధన్‌తో పాటు పలు పండుగలు రావడంతో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. వచ్చే వారంలో ఏయే రోజుల్లో బ్యాంకులు ఉంటాయి.. ఏయే రోజుల్లో మూతపడాయి అనేది తెలుసుకుందాం.

Bank Holidays: నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్.. కస్టమర్లకు బిగ్ అలర్ట్..
Bank Holidays

Updated on: Aug 23, 2026 | 10:13 PM

బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. వచ్చే వారంలో నాలుగు రోజు పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రక్షాబంధన్, మిలాద్-ఉన్-నబీ లాంటి పండుగలు రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో బ్యాంక్ పనులు ఉంటే సోమవారం పూర్తి చేసుకోవడం మంచిది. మీకు ఏదైనా అత్యవసరమైన బ్యాంకు పని ఉంటే సోమవారం మీ బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించండి. వచ్చే వారం ఒకటి లేదా రెండు కాకుండా.. నాలుగు బ్యాంకు సెలవులు ఉంటాయి. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం.. ఆగస్టు 24 నుండి ఆగస్టు 30 మధ్య సెలవుల గురించి తెలుసుకుందాం. మీరు బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించాలని అనుకుంటే ముందుగా తెరిచి ఉందో.. లేదో అనేది తనిఖీ చేసుకోవడం మంచిది. వచ్చే వారంలో బ్యాంక్ సెలవుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు సెలవుల ప్రకారం ఆగస్టు 25న మిలాద్-ఉన్-నబీ లేదా మిలాద్-ఇ-షరీఫ్ (ప్రవక్త ముహమ్మద్ జన్మదినోత్సవం), మొదటి ఓనం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, కేరళలోని బ్యాంకులు మూసి ఉంటాయి. ఇక ఆగస్ట్ 26న బరావాఫా, ఈద్-ఇ-మిలాద్ లేదా ముహమ్మద్ ప్రవక్త తిరువో, మిలాద్-ఉన్-నబీ పండుగల కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, మణిపూర్, జమ్మూ మరియు కాశ్మీర్, కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో బ్యాంకులు బంద్ అవుతాయి. ఆగస్టు 28న రక్షాబంధన్ పండుగ సందర్భంగా మధ్యప్రదేశ్, గుజరాత్, సిక్కిం, ఉత్తరాఖండ్, జమ్మూ మరియు కాశ్మీర్, రాజస్థాన్, కేరళ, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు ఉండవు

ఆగస్టు 30న ఆదివారం సందర్భంగా అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు. దీంతో వచ్చే వారంలో నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూసివేసి ఉంటాయి. ఈ క్రమంలో బ్యాంక్ ఖాతాదారులు తప్పనిసరిగా వీటి గురించి తెలుసుకుని ముందు జాగ్రత్త పడాలి. సెలవు రోజుల్లో బ్రాంచ్ సంబంధిత కార్యకలాపాలు అన్నీ నిలిచిపోతాయి. అయితే ఆన్‌లైన్ సదుపాయాలు యథావిధిగా పనిచేస్తాయి. బ్యాంకు సెలవు దినాలు ఉన్నప్పటికీ.. RTGS, NEFT, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI సేవలు, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిధిగా పనిచేస్తాయి. దీంతో ఖాతాదారులు వీటి ద్వారా తమ లావాదేవీలను యథావిధిగా నిర్వహించుకోవచ్చు. చెక్కు బుక్‌ల క్లియరెన్స్, భౌతిక రుణ పత్రాల పరిశీలన వంటి సేవలు మాత్రమే నిలిచిపోతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us