ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ) అనేది సీనియర్ సిటిజన్‌లకు మంచి పెట్టుబడి ఆప్షన్ అనే చెప్పాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, యెస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇతరులతో సహా అన్ని అగ్రశ్రేణి రుణదాతలు సాధారణ కస్టమర్‌ల కంటే సీనియర్ సిటిజన్‌లకు 50 బేసిస్ పాయింట్లు వడ్డీని అందిస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మే 2022 నుండి రెపో రేటును 225 బీపీఎస్ పెంచింది. ఫలితంగా, గత కొన్ని నెలలుగా టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ అందించే వడ్డీ రేట్లను ఒకసారి పరిశీలిద్దాం.
SBI సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీలపై 7.25% వడ్డీ రేటును అందిస్తుంది. ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీలపై 7.25% వడ్డీ రేటును అందిస్తుంది. ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్లకు అన్ని కాల వ్యవధిలో అదనంగా 50 bps వడ్డీ రేటును అందిస్తుంది. తాజా సవరణ తర్వాత, సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఎ ఫ్‌డీలపై 3.5% నుండి 7.25% వరకు పొందుతారు. ఈ వడ్డీ రేట్లు డిసెంబర్ 13, 2022 నుండి అమలులోకి వచ్చాయి.
1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ – 7.25%
2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ -7.25%
5 సంవత్సరాలు మరియు 10 సంవత్సరాల వరకు -7.25%
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై 7.5% వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 3.5 నుండి 7.75% వరకు వడ్డీ రేటును పొందుతారు. ఈ రేట్లు 14 డిసెంబర్ 2022 నుండి అమలులోకి వచ్చాయి.
☛ 1 సంవత్సరం నుండి 15 నెలల వరకు ఎఫ్‌డీలపై 7.00%
☛ 15 నెలల నుండి 18 నెలల వరకు 7.50%
☛ 18 నెలల నుండి 21 నెలల వరకు 7.00%
☛ 21 నెలలు – 2 సంవత్సరాల వరకు 7.50%
☛ 2 సంవత్సరాలు 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు 7.50%
☛ 3 సంవత్సరం 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు 7.50%
☛ 5 సంవత్సరం 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు 7.75%
ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై 7.5% వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 3.5 నుండి 7.50% వరకు వడ్డీ రేటును పొందుతారు. ఈ రేట్లు 16 డిసెంబర్ 2022 నుండి అమలులోకి వస్తాయి.
☛ 1 సంవత్సరం నుండి 389 రోజుల వరకు 7.10%
☛ 390 రోజుల నుండి 15 నెలల వరకు 7.10%
☛ 15 నెలల నుండి 18 నెలల వరకు 7.50%
☛ 18 నెలల నుండి 2 సంవత్సరాల వరకు 7.50%
☛ 2 సంవత్సరాలు 1 రోజు నుండి 3 సంవత్సరాల వరకు 7.50%
☛ 3 సంవత్సరాలు 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు 7.50%
☛ 5 సంవత్సరాలు 1 రోజు నుండి 10 సంవత్సరాల వరకు7.50%
యెస్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ ఎఫ్‌డిలపై 7.5% వడ్డీని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.75% నుండి 7.50% వరకు వడ్డీ రేటును పొందుతారు. ఈ రేట్లు 9 డిసెంబర్ 2022 నుండి అమలులోకి వచ్చాయి.
☛ 1 సంవత్సరం నుండి 20 నెలల వరకు 7.50%
☛ 22 నెలల 1 రోజు నుండి 30 నెలల వరకు 7.50%
☛ 30 నెలల 1 రోజు నుండి 36 నెలల వరకు 7.50%
☛ 36 నెలల నుండి 120 నెలల వరకు 7.50%
కోటక్ మహీంద్రా సీనియర్ సిటిజన్ ఎఫ్‌డిలపై 7.5% వడ్డీని అందిస్తోంది.
సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై 3.25% నుండి 7.50% వరకు వడ్డీ రేటును పొందుతారు. ఈ రేట్లు
☛ 15 డిసెంబర్ 2022 నుండి అమలులోకి వచ్చాయి.
☛ 365 రోజుల నుండి 389 రోజుల వరకు 7.25%
☛ 390 రోజులు (12 నెలల 25 రోజులు) 7.5%
☛ 391 రోజుల నుంచి – 23 నెలల కంటే తక్కువ 7.5%
☛ 23 నెలలు 7.5%
☛ 23 నెలలు 1 రోజు నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ 7%
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి