Bank Loan: సాధారణంగా పండగ సీజన్‌లో బ్యాంకులు, వివిధ వాహన కంపెనీలు, ఇ-కామర్స్ సంస్థలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునే విధంగా పండగల సీజన్‌లో ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇందులో భాగంగా పలు బ్యాంకులు వినియోగదారులకు రుణాలపై ఆఫర్లు ప్రకటించాయి. ఆటో లోన్ వడ్డీ రేట్లు, కారు కొనుగోలుపై వడ్డీ రేట్లు వక్కువగా వసూలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు వాహనం ఆన్ రోడ్ ధరలో 90 శాతం వరకు రుణం అందిస్తున్నాయి. ఇక మీరు కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తే 9 బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తున్నాయి.
► పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్:
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ప్రస్తుతం 6.8 శాతం వండ్డీ రేటుతో చౌకైన ఆటో రుణాన్ని అందిస్తోంది. నవంబర్ 10, 2021 వరకు లోన్ విషయంలో ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం లేదు. లక్ష రూపాయలు రుణం ఐదేళ్ల కాలానికి రూ.1,971 ఈఎంఐ రూపంలో చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది ఈ బ్యాంకు.
► బ్యాంక్ ఆఫ్ ఇండియా:
ఈ బ్యాంకు ప్రస్తుతం డిసెంబర్ 31 వరకు జీరో ప్రాసెసింగ్ రుసుముతో 6.85 శాతం వడ్డీ రేటుతో కారు లోన్ అందిస్తోంది. అలాగే లక్ష రూపాయల రుణానికి రూ.1,973 ఈఎంఐతో ప్రారంభం అవుతుంది.
► ఇండియన్ బ్యాంక్:
ఈ బ్యాంకు కారు రుణానికి 6.90 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. లక్ష రూపాయల రుణ ఐదేళ్ల కాలానికి రూ.1,975 ఈఎంఐని అందిస్తోంది.
► బ్యాంక్ ఆఫ్ బరోడా:
ఈ బ్యాంకు 7 శాతం వడ్డీతో కారు రుణం అందజేస్తోంది. ఏ వినియోగదారుడు అయినా ఐదేళ్ల పాటు లక్ష రూపాయల కారు లోన్ తీసుకుంటే రూ.1,980 ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు.
► బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర:
ఈ బ్యాంకు 7.05 శాతం వడ్డీ రేటుతో ఆటో లోన్ అందిస్తోంది. అలాగే ఐదేళ్లపాటు లక్ష రూపాయలకు రూ.1,982 ఈఎంఐని అందిస్తోంది.
►స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లు కూడా 7.25 వడ్డీ రేటును అందిస్తోంది. లక్ష రూపాయాల రుణానికి నెలవారీ ఈఎంఐ రూ.1,992 ఉంటుంది.
► పంజాబ్ నేషనల్ బ్యాంకు:
ఈ బ్యాంకు7.30 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. లక్ష రూపాయల రుణం తీసుకుంటే రూ.1,994తో ఈఎంఐ చెల్లించవచ్చు.
ఇలా వినియోగదారులను ఆకర్షించేందుకు వాహనాలపై చౌకైనా వడ్డీతో రుణాలు అందిస్తున్నాయి బ్యాంకులు. ప్రస్తుతం కార్లు కొనుగోలు చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాటిపై దృష్టి సారిస్తున్నాయి బ్యాంకులు. తక్కువ వడ్డీ వసూలు చేయడం, రుణం పొందడంలో ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా త్వరగా రుణం అందించడం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: